ETV Bharat / state

ఆ వివాదాన్ని డీఆర్టీలోనే తేల్చుకోవాలి: హైకోర్టు

author img

By

Published : Sep 25, 2020, 5:50 PM IST

అన్​రాక్ అల్యూమినియం లిమిటెడ్ రుణానికి ఇచ్చిన హామీపై వివాదాన్ని డీఆర్టీలోనే తేల్చుకోవాలని పెన్నా గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతాప్ రెడ్డి చేసే దరఖాస్తును అక్టోబరు 5 లోగా తేల్చాలని డీఆర్టీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

telangana high court hearing on penna prathap reddy
ఆ వివాదాన్ని డీఆర్టీలోనే తేల్చుకోవాలి: హైకోర్టు

అన్​రాక్ అల్యూమినియం లిమిటెడ్​కు ఇచ్చిన రుణం వసూలు కోసం అసెట్ కేర్ అండ్ రీకనస్ట్రక్షన్ ఎంటర్ ప్రైజెస్.. గతంలో డీఆర్టీని ఆశ్రయించింది. విచారణ జరిపిన డీఆర్టీ అన్​రాక్​కు సంబంధించిన 77 కోట్ల 85 లక్షల రూపాయల రుణానికి... 15 రోజుల్లో పూచీకత్తు సమర్పించాలని ఇటీవల పెన్నా ప్రతాప్ రెడ్డిని ఆదేశించింది.

లేనిపక్షంలో లక్ష 35వేల పెన్నా సిమెంట్స్ ఈక్విటీ వాటాలను జప్తు చేస్తామని స్పష్టం చేసింది. డీఆర్టీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెన్నా ప్రతాప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై జస్టిస్ ఎంఎస్.రామంచంద్రరావు, జస్టిస్ అమర్ నాథ్ గౌడ్​ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

అన్​రాక్ రుణానికి పెన్నా ప్రతాప్ రెడ్డి వ్యక్తిగత హామీదారుగా ఉన్నారని న్యాయవాది విక్రమ్ పేర్కొన్నారు. మొత్తం 1,275 కోట్ల రుణాన్ని ఏక కాలంలో పరిష్కరించుకునేందుకు ఎస్బీఐ కన్సార్టియం అంగీకరించిందని.. అందులో 400 కోట్లు చెల్లించారని.. కరోనా పరిస్థితుల వల్ల మిగతా సొమ్ము చెల్లింపులో కొంత జాప్యం జరిగిందన్నారు.

ఏక కాలంలో పరిష్కరించుకునేందుకు అంగీకారం జరిగినప్పటికీ.. లక్ష్మీవిలాస్ బ్యాంకు ఇచ్చిన రుణానికి సంబంధించి ఏసీఆర్ఈ డీఆర్టీని ఆశ్రయించిందన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. వివాదం డీఆర్టీ వద్దే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.