ETV Bharat / state

Telangana Gurukul Results 2023 : నెలాఖరులోగా గురుకుల పోస్టుల ఫలితాలు.. అక్టోబర్‌కల్లా నియామకాలు..!

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2023, 10:08 AM IST

Telangana Gurukul Results 2023 : రాష్ట్రంలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఈ నెల 1 నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫలితాలు నెలాఖరులోగా వెల్లడి కానున్నాయి. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు కసరత్తు చేస్తోంది.

TS Gurukulam Results 2023
Telangana Gurukulam Results 2023

Telangana Gurukul Results 2023 : రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ఫలితాలు ఈ నెలాఖరులోగా వెల్లడి కానున్నాయి. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో రోజుకు మూడు షిప్టుల చొప్పున రాత పరీక్షలను గురుకుల నియామక బోర్డు(TREIRB) నిర్వహించింది. వాటికి సగటున 75.68 శాతం మంది హాజరైనట్లు.. బోర్డు కార్యనిర్వహణాధికారి మల్లయ్య భట్టు తెలిపారు. పరీక్షల మాస్టర్‌ ప్రశ్న పత్రాలు, అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక కీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

TS Gurukulam Exam 2023 : మూడు పేపర్లు.. మూడు జిల్లాల్లో..

TREIRB Results 2023 : అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్‌ ద్వారా సమాధానాలు సరి చూసుకోవాలని.. ప్రాథమిక కీ పై అభ్యంతరాలుంటే గడువు తేదీలోగా తెలపాలని సూచించారు. అభ్యంతరాలు లాగిన్‌ ఐడీ ద్వారా మాత్రమే తెలపాలని, ఈ-మెయిల్, వ్యక్తిగత, రాతపూర్వక అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక కీ ఈరోజు మధ్యాహ్నానికి అందుబాటులోకి వస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి.

Telangana Gurukulam Results 2023.. : రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 19 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన మాస్టర్‌ ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక కీ, అభ్యర్థుల సమాధానాలను గురుకుల నియామక బోర్డు వెబ్‌సైట్‌లోని వ్యక్తిగత లాగిన్‌లో బుధవారం పొందుపరిచింది. ఈ ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. రేపు (ఈ నెల 25వ తేదీ) సాయంత్రంలోగా తెలపాలని సూచించింది.

ఈ క్రమంలోనే ఈ నెల 21, 22, 23 తేదీల్లో జరిగిన ఎగ్జామ్స్‌కు సంబంధించి అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక కీ ఈ మధ్యాహ్నానికి అందుబాటులోకి వస్తుందని బోర్డువర్గాలు తెలిపాయి. ఈ 3 పరీక్షల ప్రాథమిక కీపై అభ్యంతరాలను 26 సాయంత్రంలోగా తెలపాల్సి ఉంటుంది. మరోవైపు ఈ నెల 1వ తేదీన జరిగిన ఆర్ట్‌, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌ టీచర్ల పరీక్షలపై న్యాయ వివాదం నెలకొంది. ఇది పరిష్కారమైన తరువాత.. వాటి ప్రాథమిక కీ, అభ్యర్థుల సమాధానాలను బోర్డు పొందుపరచనున్నారు.

గురుకులాల్లో భారీగా పోస్టులు.. 10 వేల వరకు భర్తీ అయ్యే అవకాశం..

అక్టోబర్‌కల్లా నియామకాల పూర్తికి కసరత్తు.. : ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని తీసుకుని, పరిశీలించి రెండు రోజుల్లోగా తుది కీలను గురుకుల నియామక బోర్డు ప్రకటించనుంది. అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో కూడా వివరంగా తెలపనుంది. ఉన్నత స్థాయి పోస్టుల నుంచి కింది స్థాయి పోస్టులకు అవరోహణ క్రమంలో నియామక ప్రక్రియ పూర్తి చేయనుంది. ముందుగా డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్‌, తర్వాత పీజీటీ, టీజీటీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అక్టోబరు నెలాఖరు నాటికి నియామకాలు పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.

TS Gurukul Notification: 4,006 టీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Gurukula Degree colleges: డిగ్రీకి వచ్చినా నేలమీదే.. గురుకులాల్లో కనీస సౌకర్యాలు లేక అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.