ETV Bharat / state

Telangana Decade celebrations 2023 : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాహితీ వేడుకలు

author img

By

Published : Jun 11, 2023, 7:57 PM IST

Updated : Jun 11, 2023, 10:17 PM IST

Telangana Decade celebrations
Telangana Decade celebrations

Telangana Sahithi Usthavalu 2023 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సర్కార్‌ నిర్వహించిన సాహితీ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. భారత్​ జాగృతి ప్రచురించిన చరిత్ర పుస్తకం 5 సంపుటాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైందని.. నాటి సామాజిక పరిస్థితులు, పరిపాలన రీతితో భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో కవి సమ్మేళనంలో భాగంగా.. పలువురు ఉర్దూ, తెలుగు కవులను మంత్రులు ఘనంగా సత్కరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాహితీ వేడుకలు

Telangana Decade celebrations Today Special : చరిత్రను అర్థం చేసుకుంటే వర్తమానాన్ని అవగాహన చేసుకుంటూ భవిష్యత్‌కు బాటలు వేసుకోగలమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను భావితరాలకు తెలియజేసేలా భారత్‌ జాగృతి సంస్థ ప్రచురించిన తెలంగాణ చరిత్ర పుస్తకం 5 సంపుటాలను దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రగతి భవన్‌లో సీఎం ఆవిష్కరించారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల నాటి చారిత్రక ఆనవాళ్లు తెలంగాణలో బయటపడటం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్న సీఎం ఈ దిశగా చరిత్రకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

మహోన్నతమైన తెలంగాణ చారిత్రక వారసత్వం కోట్లాది సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పారు. జాతిపిత చెప్పిన గంగా జమున తెహజీబ్‌ తెలంగాణలో కనిపిస్తోందని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన వేడుకలకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉర్దూ, తెలంగాణ సాహితీవేత్తలను మంత్రి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కవి సమ్మేళనాలు నిర్వహించి కవులకు, సాహితీవేత్తలకు అవార్డులు అందించనున్నట్లు మంత్రులు తెలిపారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో స్థానిక ఎమ్మెల్యే సండ్ర నేతృత్వంలో కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరవలేనిదని దేవాదాయ, అటవీశాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. నిర్మల్ కలెక్టరేట్‌లో జరిగిన కవి సమ్మేళనానికి మంత్రి హాజరయ్యారు. రాష్ట్రాభివృద్ధిపై ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనం అలరించింది. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కవులు, కళాకారులకు స్వరాష్ట్రంలో సముచిత స్థానం దక్కిందన్న ఇంద్రకరణ్‌ రెడ్డి.. సాహితీ ప్రియుడైన సీఎం కేసీఆర్‌ కళారంగానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.

తెలంగాణ సాహిత్య దినోత్సవం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్​ జూలూరు గౌరీ శంకర్, రాష్ట్ర గ్రంథాల ఛైర్మన్​ శ్రీధర్​తో పాటు పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ పథకాలతో రాష్ట్ర అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న తీరుపై పలువురు కవులు వారి కవిసమ్మేళనం ద్వారా చక్కగా వివరించారు.

Telangana Decade celebrations 2023 : అంతరించి పోతున్న సాహిత్య కళను భవిష్యత్తు తరాలకు తెలిసేలా వారి రచనలు గేయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా దశాబ్ది ఉత్సవాలలో సాహిత్య వేత్తలను గౌరవించుకుంటున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్​ అనుదీప్​ అన్నారు. సాహిత్య దినోత్సవంలో బాగంగా భద్రాద్రి రామయ్య సన్నిధి వద్ద గల భక్త రామదాసు విగ్రహానికి పూలమాలలు వేశారు.


ఇవీ చదవండి:

Last Updated :Jun 11, 2023, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.