ETV Bharat / state

రాష్ట్ర రాజకీయమంతా ఎల్లా హోటల్లోనే - సీఎం అభ్యర్థి ప్రకటనపై కొనసాగుతున్న ఉత్కంఠ

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2023, 4:21 PM IST

Congress Activists Concerns for Revanth Reddy As CM
Telangana CM Name Announcement Delay

Telangana CM Name Announcement Delay : తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి ఎంపికలో కాంగ్రెస్‌ అధిష్ఠానం నిమగ్నమైన వేళ, రాష్ట్రంలో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో వేచి ఉన్నారు. రాష్ట్ర రాజకీయమంతా ఆ హోటల్ నుంచే జరగటం గమనార్హ విషయం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం గత 48 గంటలుగా హోటల్‌ నుంచే పార్టీ నేతలతో మంతనాలు జరుపుతూ, ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు.

Telangana CM Name Announcement Delay : ముఖ్యమంత్రి ఎంపికలో కాంగ్రెస్‌ అధిష్ఠానం నిమగ్నమైన వేళ, రాష్ట్రంలో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని వేచి ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు 48 గంటలుగా ఎల్లా హోటల్‌లోనే ఉన్నారు. హోటల్ నుంచే పార్టీ నేతలతో రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మంతనాలు జరుపుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమవుతున్నారు.

కొత్తగా కొలువుదీరనున్న కేబినెట్ - మంత్రులుగా ఛాన్స్​ వీరికేనా?

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై రేవంత్‌ చర్చిస్తున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ సైతం ఎత్తేయటంతో రేవంత్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎల్లా హోటల్‌ వద్దకు అధికారులు(Officials) వరుస కట్టారు. ఈ నేపథ్యంలో హోటల్‌లో ఆయన ఉన్న గది వద్ద పోలీసులు భద్రత పెంచారు. అటు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు భద్రత పెంచారు.

Telangana Congress CM Race : ఇదిలా ఉండగా కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యులకు ఎల్లా హోటల్‌లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రంలో హోటల్‌లోనే ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, మాజీ మంత్రి చిన్నారెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అసెంబ్లీ వ్యవహారాలు, ఎమ్మెల్యేల పనితీరుపై వారు అవగాహన కల్పించనున్నట్లు పార్టీ నేత, హుస్నాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar) తెలిపారు.

సీఎం అభ్యర్థి ప్రకటనపై వీడని ఉత్కంఠ - మరింత ఆలస్యమయ్యే అవకాశం!

ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని అధిష్ఠానం ఎన్నుకుటుందని, అధికారికంగా సమాచారం ఇవ్వడం జరుగుతుందని అప్పటివరకు వేచి ఉండాలని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ తెలిపారు. గచ్చిబౌలి ఎల్లా హోటల్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ సాయంత్రం వరకు కాంగ్రెస్ అధిష్ఠానం(Congress leadership) ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి, క్యాబినెట్ సభ్యులు పూర్తి వివరాలు అధికారికంగా త్వరలోనే ప్రకటించడం జరుగుతుందన్నారు.

ముఖ్యమంత్రిగా రేవంత్‌వైపే రాహుల్‌ మొగ్గు - సాయంత్రం సీఎల్పీ భేటీలో ప్రకటించనున్న డీకే

Congress Activists Concerns for Revanth Reddy As CM : ఇదిలా ఉండగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ప్రకటించడంలో జాప్యం జరుగుతుందని గచ్చిబౌలి ఎల్లా హోటల్‌ వద్దకు కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. రేవంత్‌రెడ్డిని సీఎంగ్ ప్రకటించాలంటూ హోటల్‌ ముందు ఆందోళనకు దిగారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, హోటల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు(Police) వారిని అడ్డుకునే క్రమంలో ఓ యువకుడు తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

రాజ్​భవన్​లో నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు - మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.