ETV Bharat / bharat

సీఎం అభ్యర్థి ప్రకటనపై వీడని ఉత్కంఠ - మరింత ఆలస్యమయ్యే అవకాశం!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 7:41 PM IST

Updated : Dec 5, 2023, 7:01 AM IST

Suspense on Telangana New CM Candidate : ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. నూతన సీఎం ఎవరనేది ఇవాళ్టితో ముగింపుపడే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ తరఫున గెలిచిన 64 మందిలో దాదాపు 55 మంది ఎమ్మెల్యేలు సీఎంగా రేవంత్‌రెడ్డి వైపే మెుగ్గుచూపినట్లు తెలుస్తోంది.

Suspense on Telangana New CM Candidate
Suspense on Telangana New CM Candidate

సీఎం అభ్యర్థి ప్రకటనపై వీడని ఉత్కంఠ - నేడు ప్రమాణ స్వీకారం లేనట్లే!

Suspense on Telangana New CM Candidate : రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీని కాంగ్రెస్‌ సాధించి అధికారాన్ని చేజిక్కుంచుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 64 మందిని హైదరాబాద్‌ రప్పించి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఉంచారు. కాగా సోమవారం ఉదయమే ఎమ్మెల్యేలతో సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకునే ప్రక్రియ ఉంటుందని డీకే శివకుమార్‌ ప్రకటించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్ధి, ఉపముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్ష పదవి, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ శాఖలు తదితర పదవులపై చర్చలు జరిపినట్లు సమాచారం.

సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానిదే - సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేల తీర్మానం

ఉప ముఖ్యమంత్రితో పాటు పీసీసీ పదవి తనకే ఇవ్వాలని ఓ సీనియర్‌ నాయకుడు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మరో సీనియర్‌ నాయకుడు ఉపముఖ్యమంత్రి ఇవ్వాలని పట్టుబట్టగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవకాశం లేదని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ విషయం ఏఐసీసీ దృష్టికి వెళ్లడంతో సీఎల్పీ నేత ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Karnataka Deputy Minister DK Shivakumar)ను ఏఐసీసీ ఆదేశించినట్లు సమాచారం.

రాజ్​భవన్​లో నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు - మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్

సోమవారం జరిగిన సీఎల్పీ భేటీలో 3 తీర్మాణాలు చేసినట్లు కాంగ్రెస్‌ వెల్లడించింది. సీఎల్పీ నేత, సీఎం అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మాణం చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల సేకరణలో దాదాపు 55మంది సీఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి వైపే మెుగ్గు చూపినట్లుగా సమాచారం. ఆ తీర్మానాన్ని దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏఐసీసీ పరిశీలకులు(AICC Members in Delhi) పంపారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని ఎమ్మెల్యేలకు చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో మూడు పార్టీల్లో గెలిచిన 'త్రిమూర్తులు'

రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా ఎవరిని నియమిస్తారనేది మధ్యాహ్నం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు వివరించేందుకు డీకే శివకుమార్, మాణిక్‌రావు ఠాక్రే దిల్లీకి వెళ్లారు. ఎవరిని ఏ పదవిలో నియమించాలో అధిష్ఠానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. పార్లమెంటులో ఇండియా కూటమి భేటీ(INDIA Alliance Meeting) తర్వాత తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అధిష్ఠానం ఆమోద ముద్ర తర్వాత ఏఐసీసీ పరిశీలకుడిగా దిల్లీ లేదా హైదరాబాద్‌ వేదికగా ఆ వివరాలను డీకే శివకుమార్‌ వెల్లడించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్‌కు కొత్త తిప్పలు - శాసనమండలిలో తక్కువగా బలం

Congress CM Oath Ceremony 2023 : ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రమాణస్వీకారోత్సవానికి పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ , ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేలతో పాటు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ఇతర జాతీయ స్థాయి నాయకులు, వామపక్షాల నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సీఎం అభ్యర్థి ప్రకటనపై వీడని ఉత్కంఠ - మరింత ఆలస్యమయ్యే అవకాశం!

Telangana Election Result 2023 LIVE Telangana Overall Politics : మార్పు మంత్రానికే ఓటు - 64 స్థానాలతో సంపూర్ణ ఆధిక్యాన్ని సాధించిన హస్తం

Last Updated :Dec 5, 2023, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.