ETV Bharat / state

T Congress Plans for Assembly Elections 2023 : పైరవీలతో కాదు.. ప్రజల్లో ఉంటేనే టికెట్‌.. ప్రజాబలం ఉన్న నేతలకే అవకాశాలు.!

author img

By

Published : Aug 16, 2023, 7:58 AM IST

Assembly Elections
Congress

T Congress Plans for Assembly Elections 2023 : దిల్లీ చుట్టూ తిరిగితే ఉపయోగంలేదు.. గల్లీగల్లీకి వెళ్లాల్సిందే. పైరవీలతో కాదు.. ప్రజల్లో ఉంటేనే టికెట్‌. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలవుతున్న వేళ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆ పార్టీ నేతలకు తేల్చిచెప్పిన మాటలివి. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్​తో తాడోపేడో తేల్చుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్న హస్తం పార్టీ.. టికెట్ల కేటాయింపు విషయంలో స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతోంది. హస్తినలో ఎంత పలుకుబడి ఉన్నా.. ప్రజా బలం ఉన్న నేతలకే టికెట్‌ అంటూ కరాఖండిగా తేల్చిచెబుతోంది.

T Congress Assembly Election Plans 2023 పైరవీలతో కాదు.. ప్రజల్లో ఉంటేనే టికెట్‌..! ప్రజాబలం ఉన్న నేతలకే అవకాశాలు

T Congress Plans for Assembly Elections 2023 : రానున్న ఎన్నికల్లో టికెట్లు ఎవరికివ్వాలనే అంశంపై కాంగ్రెస్‌(Indian National Congress) అధిష్ఠానం స్పష్టమైన విధానాన్ని ఎంచుకుంది. పార్టీలో గ్రూపులు నిర్వహించే నేతలు వారి అనుచరులకు టికెట్లు ఇవ్వాలంటూ పైరవీచేస్తే తిరస్కరించాలని నిర్ణయించింది. ప్రజాబలం ఉన్న నేతలకే అవకాశాలు ఇవ్వాలన్న హస్తం పార్టీ.. ఈ విషయంలో మరో అభిప్రాయానికి తావివ్వకూడదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇదే విషయాన్ని పార్టీ ఎన్నికల కమిటీకి తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే కేరళకు చెందిన మురళీధరన్‌ను అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్‌ కమిటీకి ఛైర్మన్‌గా నిర్ణయించింది. అగ్రనేతలకు విశ్వాసపాత్రుడైన మురళీధరన్‌.. ఎవరో ఒకరిద్దరు సీనియర్‌ నేతలు చెప్పేవారికి టికెట్లు ఇవ్వడాన్ని అంగీకరించే రకం కాదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Congress Chevella Public Meeting on 24th August : 24న చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఖర్గే

Congress Plans To Win in Telangana Elections : కాంగ్రెస్ అధినాయకత్వం పైరవీల విషయంలో ఇంత కఠినంగా ఉండటానికి కర్ణాటకలో వచ్చిన ఫలితాలే కారణమని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికలలో(Karnataka Elections) అక్కడ రెండు గ్రూపులకు నాయకత్వం వహించిన నేతలు.. పట్టుబట్టి తమ అనుచరులకు 13 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఇప్పించారు. అప్పుడున్న పరిస్థితుల్లో అధిష్ఠానం వారి ఒత్తిడికి తలొగ్గింది. అయితే ఆ 13 స్థానాల్లో కేవలం ఒకచోట మాత్రమే హస్తం పార్టీ గెలిచింది. గ్రూపు నేతల పైరవీలు, ఒత్తిడితో చివరి క్షణంలో తలూపి తప్పుచేశామని అర్థం చేసుకుంది. ఇతర స్థానాల్లో సర్వేల ఆధారంగా గెలుస్తారనే అంచనాతో ఎంపిక చేసిన అభ్యర్థులు నెగ్గడంతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చామని, లేకపోతే ఈ 13 స్థానాల ఓటమితో పరిస్థితి తారుమారయ్యేదని ఫలితాల విశ్లేషణలో గుర్తించిందని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. త్వరలో ఎన్నికలు జరిగే తెలంగాణలో కర్ణాటక అనుభవాలు పునరావృతం కాకుండా చూడాలని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఇటీవల పార్టీ ఎన్నికల కమిటీకి హెచ్చరించినట్టు తెలుస్తోంది.

Congress BRS Raise Political Heat in Telangana : అగ్రనాయకులతో సభలు, ప్రచారాలు.. కాంగ్రెస్​ను గెలిపించేనా...?

సీనియర్లంతా ఐకమత్యంగా పనిచేయాల్సిందే : ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో సీనియర్‌ నేతల మధ్య పొసగడం లేదని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే గుర్తించింది. కొందరు సీనియర్‌ నేతలు కొంతకాలంగా దిల్లీకి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తాజాగా మూడురోజుల క్రితం కాంగ్రెస్ బీసీ వర్గ సీనియర్‌ నేత ఒకరు దిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్లంతా ఐకమత్యంగా పనిచేయాల్సిందేనని, ఎవరో ఒకరు చెప్పినట్లుగా బీఫారాల పంపిణీ ఉండదని రాహుల్‌గాంధీ సదరు సీనియర్‌ నేత వద్ద కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. అదే తరుణంలో తెలంగాణలో అంతర్గతంగా గ్రూపుల పోరు నడుస్తున్నందున టిక్కెట్ల పంపిణీ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఇప్పట్నుంచే స్క్రీనింగ్‌ కమిటీకి హెచ్చరికలు పంపుతూ వస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Telangana Congress Focus On Assembly Elections : కాగా.. ప్రతి అసెంబ్లీ స్థానం నుంచి టిక్కెట్లు ఆశించే వారి నుంచి ఈ నెల 18 నుంచి 25 వరకూ దరఖాస్తులు తీసుకోవాలని స్క్రీనింగ్‌ కమిటీ, ఎన్నికల కమిటీలు నిర్ణయించాయి. ఈ నెల 26 నుంచి వచ్చే నెల మొదటి వారం వరకూ దరఖాస్తులు ఇచ్చిన వారి బలాబలాలపై క్షేత్రస్థాయిలో అధిష్ఠానం నేరుగా సర్వే చేయించనుంది. ఆ ఫలితాల ఆధారంగా మెరుగైన అభ్యర్థులను గుర్తించి తుది జాబితా సిద్ధం చేయాలని యోచిస్తోంది. నేరుగా ప్రియాంకగాంధీ(Priyanka Gandhi), రాహుల్‌గాంధీలు తెలంగాణ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నందున టికెట్ల పంపిణీలో గ్రూపులు నడిపేవారి మాటలు చెల్లకపోవచ్చని నేతలు అంచనా వేస్తున్నారు.

T Congress Assembly Elections 2023 Plan : MLAగా పోటీ చేయాలనుందా​? కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. అప్లై చేసేయండి

Telangana Congress PEC Meeting Today : నేడు తెలంగాణ కాంగ్రెస్​ నేతల కీలక సమావేశం.. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.