ETV Bharat / state

Congress Chevella Public Meeting on 24th August : 24న చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఖర్గే

author img

By

Published : Aug 15, 2023, 4:23 PM IST

Chevella Public Meeting
Congress

Congress Chevella Public Meeting on 24th August : చేవెళ్లలో ఈనెల 24వ తేదీన బహిరంగ సభ నిర్వహించనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్నట్లు పేర్కొన్నారు. సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని రేవంత్ స్థానిక నాయకులకు సూచించారు. మరోవైపు వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా మందకృష్ణ మాదిగకు రేవంత్ చురకలంటించారు.

Congress Chevella Public Meeting on 24th August : తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ తమదైన శైలిలో వ్యూహాలను రచించుకుని.. ఎన్నికల(Telangana Assembly Elections 2023) సమరానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న కాంగ్రెస్ శాసనసభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించింది. తెలంగాణలో వరుసగా పార్టీ అగ్రనేతల పర్యటనలు ఉండేట్లు పీసీసీ షెడ్యూల్‌ సిద్దం చేస్తోంది. ఈ నేపథ్యంలో 18న చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించాలనుకున్నారు. తాజాగా సమయాభావం దృష్ట్యా చేవెళ్ల సభ తేదీని మార్చుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అలాగే తదుపరి తేదీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(Revanthreddy) ప్రకటించారు.

Mallikarjun Kharge Telangana Tour : చేవెళ్లలో ఈనెల 24వ తేదీన బహిరంగ సభ నిర్వహించనున్నట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. చేవెళ్ల సభ ఏర్పాట్లపై నియోజకవర్గ నాయకులు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, నియోజకవర్గ ఇంఛార్జి సత్యనారాయణ రెడ్డి తదితరులతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే(Manikrao Thakre)లు సమావేశమయ్యారు. ఈ నెల 18వ తేదీ సభ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ సమయం సరిపోదని స్థానిక నాయకులు పీసీసీ అధ్యక్షుడు దృష్టికి తీసుకొచ్చారు. చేవెళ్ల సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్నారు. సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని రేవంత్ రెడ్డి స్థానిక నాయకులకు సూచించారు.

Congress BRS Raise Political Heat in Telangana : అగ్రనాయకులతో సభలు, ప్రచారాలు.. కాంగ్రెస్​ను గెలిపించేనా...?

Revanthreddy on Mandakrishna Madiga Comments : మరోవైపు వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా మందకృష్ణ మాదిగకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చురకలంటించారు. గాంధీభవన్​లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. వర్గీకరణపై సోమవారం(ఆగస్టు 14) నాడు మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. మాట ఇచ్చిన వాళ్లని ప్రశ్నించి, చిత్తశుద్ది నిరూపించుకోవాలని మందకృష్ణకి సూచించారు. కిషన్​రెడ్డి దేవుడు ఇచ్చిన అన్న కదా... ఆయన్ని ఎందుకు అడగడం లేదని రేవంత్ ప్రశ్నించారు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్(Indian National Congress) చిత్తశుద్ధిని ఎవ్వరు ప్రశ్నించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. మద్దతు ఒకరికిచ్చి.. మరొకరిని ప్రశ్నిస్తే ఎలా అని నిలదీశారు.

Congress Party Members For Elections 2023 : 60 నియోజక వర్గాల్లో కాంగ్రెస్​ పార్టీ సభ్యుల జాబితా సిద్ధం..!

కిషన్ రెడ్డి ఆ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదు : రాహుల్ గాంధీ కూడా వర్గీకరణపై కాంగ్రెస్ విధానాన్ని చెప్పారన్న రేవంత్​రెడ్డి.. వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ వ్యక్తుల కోసం చేయమన్న ఆయన.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై కాంగ్రెస్​కు స్పష్టమైన విధానం ఉందని స్పష్టం చేశారు. జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ ఎలా చేయాలో తమకు తెలుసని, ఎవరికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఎవరి వాకాల్తాలు తమకు అవసరం లేదని, ఎస్సీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ఏంటో తెలుసన్నారు. కిషన్ రెడ్డి(Kishanreddy) ఎందుకు పార్లమెంట్​లో మాట్లాడం లేదన్న రేవంత్​రెడ్డి.. వారి ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు.

T Congress Assembly Elections 2023 Plan : MLAగా పోటీ చేయాలనుందా​? కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. అప్లై చేసేయండి

Telangana Congress New Strategy : కాంగ్రెస్ స్మార్ట్ మూవ్.. ప్రియాంక, డీకేలకు తెలంగాణ గెలుపు బాధ్యతలు

Revanthreddy on Assembly Seats : 'రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యతను నేను తీసుకుంటా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.