ETV Bharat / state

JUDGE:హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

author img

By

Published : Aug 18, 2021, 7:50 PM IST

Updated : Aug 18, 2021, 8:38 PM IST

JUDGE:హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
JUDGE:హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

19:47 August 18

హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

న్యాయాధికారుల కోటాలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన వారిలో సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి జస్టిస్‌ పి.శ్రీరాధ, జ్యూడీషియల్‌ అకాడమీ డైరక్టర్‌ సి.సుమలత, తెలంగాణ వ్యాట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌ జి.రాధారాణి, ఖమ్మం ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి ఎం.లక్ష్మణ్‌, తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి తుకారాంజీ, రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎ.వెంకటేశ్వరరెడ్డి, ఇన్‌కంట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ జ్యుడీషియల్‌ సభ్యులు పి.మాధవిదేవి పేర్లను సిఫారసు చేశారు. 

   రాష్ట్ర హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచిన కీలక ఉత్తర్వులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించగా... సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి పేర్లను సిఫారసు చేసింది.

సీజేఐ చొరవతో.. 

గతంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చొరవతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఒకేసారి 24 నుంచి 42కి పెరిగింది. పెండింగ్‌ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని 2019 ఫిబ్రవరి 13న అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదనలు పంపారు. పరిశీలన తర్వాత న్యాయశాఖ దాన్ని అప్పట్లో పెండింగ్‌లో పెట్టింది. ముఖ్యమంత్రి నుంచి లేఖ, ప్రధానమంత్రి కార్యాలయం చేసిన సూచనలను అనుసరించి మరోసారి పరిశీలించింది. సంఖ్య పెంచడం కంటే ముందు న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అదే ఏడాది నవంబరు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. 

జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వివిధ హైకోర్టుల ప్రతిపాదనలను సమీక్షించారు. ఆ విషయాలను ప్రధానమంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందులో న్యాయమూర్తుల సంఖ్య పెంపుపై తెలంగాణ హైకోర్టు పంపిన ప్రతిపాదనల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇదీ చదవండి: Anganwadi: అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తల వేతనాలు 30 శాతం పెంపు

Last Updated :Aug 18, 2021, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.