ETV Bharat / state

Srinivas Goud: భవిష్యత్తులో మెరుగైన క్రీడా పాలసీ తీసుకొస్తాం: శ్రీనివాస్​ గౌడ్

author img

By

Published : Oct 23, 2021, 7:52 PM IST

Srinivas Goud
రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణ అంటేనే క్రీడలకు పుట్టినిల్లు లాంటిదని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మెరుగైన పాలసీని తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్​కు చెందిన అక్రమ్ గోవాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీల గోడపత్రికను ఆయన విడుదల చేశారు.

భవిష్యత్తులో మెరుగైన క్రీడా పాలసీ తీసుకొస్తాం: శ్రీనివాస్​ గౌడ్

రాష్ట్రానికి చెందిన వ్యక్తి మరో రాష్ట్రంలో అంతర్జాతీయ పోటీలు నిర్వహించడం గర్వకారణమని ​క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. హైదరాబాద్​కు చెందిన బాడీబిల్డర్‌ అక్రమ్​ ఆధ్వర్వంలో గోవాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాడీ బిల్డింగ్‌ పోటీలకు సంబంధించిన గోడ పత్రికను తెలంగాణ భవన్‌లో మంత్రి ఆవిష్కరించారు. హైదరాబాద్​ అంటే పలు రకాల క్రీడలకు పుట్టినిల్లు లాంటిదని మంత్రి కొనియాడారు.

రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే త్వరలోనే మంచి క్రీడా పాలసీని తీసుకొస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. వారిని గౌరవించడంతో పాటు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. మన రాష్ట్ర క్రీడాకారుడు అంతర్జాతీయ క్రీడా పోటీలను గోవాలో నిర్వహించడం అభినందనీయమన్నారు. డిసెంబర్‌ 14, 15 తేదీల్లో గోవాలో అంతర్జాతీయ బాడీబిల్డింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు అక్రమ్​ క్లాసిక్ వ్యవస్థాపకులు తెలిపారు.

ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్​షిప్​ గోవాలో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటేనే రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్ క్రీడలకు పుట్టినిల్లు లాంటిది. తెలంగాణకు చెందిన వ్యక్తి మరో రాష్ట్రంలో పోటీలు నిర్వహించడం మనకే గర్వకారణం. ఇలాంటి ఈవెంట్​ నిర్వహించడం చాలా గొప్పగా ఉంది. భవిష్యత్తులో మన రాష్ట్రంలో మెరుగైన క్రీడా పాలసీ తీసుకొస్తాం. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించే వారికి తగిన గుర్తింపునిస్తాం. క్రీడాకారులకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఇలాంటి వారికి మా తరఫున సంపూర్ణ సహకారం అందిస్తాం.

- శ్రీనివాస్ గౌడ్, క్రీడాశాఖ మంత్రి

ఇదీ చూడండి:

Minister Srinivas Goud:క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట... త్వరలోనే క్రీడా పాలసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.