ETV Bharat / state

ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు 5 వేల మె.ట.ఆక్సిజన్​ సరఫరా

author img

By

Published : Jun 7, 2021, 6:42 PM IST

తెలుగు రాష్ట్రాలకు ఇప్పటి వరకు 5 వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​కు సరఫరా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ పేర్కొంది. తెలంగాణకు 2,605 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్, ఆంధ్రప్రదేశ్​కు 2,440 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసినట్లు ద.మ.రైల్వే స్పష్టం చేసింది.

Oxygen Supply for 5 thousand metric tons
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు 5 వేల మె.ట.ఆక్సిజన్​ సరఫరా

తెలుగు రాష్ట్రాలకు నేటి వరకు 5 వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ను సరఫరా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. తెలంగాణకు 2,605 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్, ఆంధ్రప్రదేశ్​కు 2,440 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసినట్లు ద.మ.రైల్వే తెలిపింది. 66 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లలో 293 ట్యాంకర్లలో 5,045 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్​ను తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ తీసుకొచ్చింది.

ఒడిశా నుంచి 2,828 మెట్రిక్‌ టన్నులు, జార్ఖండ్‌ నుంచి 1,208 మెట్రిక్‌ టన్నులు, గుజరాత్‌ నుంచి 929 మెట్రిక్‌ టన్నులు, పశ్చిమ బంగాల్‌ నుంచి 80 మెట్రిక్‌ టన్నులు సరఫరా అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణపట్నం పోర్టు, తాడిపత్రి ప్రాంతాలకు 2,440 మెట్రిక్‌ టన్నులు, తెలంగాణలోని సనత్‌నగర్‌ గూడ్స్‌ కాంప్లెక్స్‌కు 2,605 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్​ను రైల్వే సరఫరా చేసింది. ఈ రైళ్లు సగటున గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: Corona : కేబీఆర్​ పార్కు వద్ద శునకాలకు కరోనా లక్షణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.