ETV Bharat / state

పేపర్​ లీకేజీలో.. టీఎస్​పీఎస్సీ కమిషన్​లోని 40మంది సిబ్బందికి సిట్​ నోటీసులు

author img

By

Published : Mar 22, 2023, 3:13 PM IST

Updated : Mar 22, 2023, 6:22 PM IST

SIT Investigation 5th Day In TSPSC Paper Leakage: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీలో సిట్​ అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. టీఎస్​పీఎస్సీ కమిషన్​లోనే సుమారు 40 సిబ్బందికి సిట్​ అధికారులు నోటీసులు జారీ చేశారు. గ్రూప్​-1 రాసిన వారితో పాటు వీరికి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ విధంగా చాలా కీలక విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది.

tspsc paper leackage
tspsc paper leackage

SIT Investigation 5th Day In TSPSC Paper Leakage: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో నిందితులను సిట్​ ఐదో రోజు ప్రశ్నిస్తోంది. ఈ విచారణలో టీఎస్​పీఎస్సీకి కొత్త కొత్త నిజాలు తెలుస్తున్నాయి. నిందితుల నుంచి మంగళవారం కీలక సమాచారం రాబట్టిన సిట్​ అధికారులు.. నేడు కూడా అదే రీతిలో కొత్త విషయాలు తెలుసుకున్నారు.

టీఎస్​పీఎస్సీ కమిషన్​లోని దాదాపు 40 మంది సిబ్బందికి సిట్​ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కమిషన్​లోని మొత్తం 10 మంది ఉద్యోగులు పరీక్ష రాసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే గ్రూప్​-1 పరీక్ష రాసిన ఉద్యోగులతో పాటు మిగిలిన వాళ్లకు కూడా నోటీసులు అందించారు. ఈ గ్రూప్​-1 పేపర్​ లీకేజీతో నిందితులు బాగానే లబ్ధి పొందినట్లు సిట్​ బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది.

కోచింగ్​ సెంటర్​ నిర్వాహకులకు, అభ్యర్థులకూ నోటీసులు?: నిందితులు ఎవరేవరికి కాల్స్​ చేశారనే కోణంలో దర్యాప్తు చేసిన సిట్​ అధికారులకు.. రేణుక, ఢాక్యానాయక్​లు పలువురు పోటీ పరీక్షల అభ్యర్థులతో పాటు.. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడినట్లు అనుమానిస్తున్నారు. అయితే రేణుకా కాల్​ డేటా ఆధారంగా అభ్యర్థులతో పాటు కోచింగ్​ సెంటర్​ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్​ అధికారులు ఉన్నట్లు సమాచారం.

Sit Notices For 40 Employees Of TSPSC Commission: ఈ గ్రూప్​-1 పేపర్ లీకేజీ ఫలించిన తర్వాతనే.. ప్రవీణ్​, రాజశేఖర్​రెడ్డి ఇతర పేపర్లను లీక్​ చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. పేపర్​ లీకేజీలో అన్నింటి కన్నా ఏఈ ప్రశ్నపత్రం లీక్​తోనే భారీగానే లబ్ధిపొందినట్లు ఆధారాలు సేకరించారు. ఈ విధంగా నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తుంటే.. కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయని సిట్​ అధికారులు తెలుపుతున్నట్లు సమాచారం.

TSPSC Paper Leakage: అయితే ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టు చేసిన 9 మంది నిందితులకు 6రోజుల కస్టడీలో భాగంగా సిట్​ ఐదో రోజు విచారణను కొనసాగిస్తోంది. ఈ విచారణలో భాగంగా ప్రధాన నిందితులు ప్రవీణ్​, రాజశేఖర్​రెడ్డి బ్యాంకు ఖాతాలను సిట్​ బృందం పరిశీలిస్తోంది. అలాగే ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న రేణుక, ఢాక్యా నాయక్​ దంపతుల బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా జరిగిన లావాదేవీలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.

మంగళవారం కాన్ఫిడెన్షియల్​ సెక్షన్​ సూపరెంటెండెంట్​ అధికారిని శంకరలక్ష్మి సైతం విచారించి.. ఆమె వద్ద నుంచి కొన్ని వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన సమాచారం ప్రకారం ఐదో రోజు ప్రధాన నిందితుడు ప్రవీణ్​ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా లోతుగా విచారణ సాగించడానికి టీఎస్​పీఎస్సీలో మరికొంత మంది సిబ్బందికి సిట్​ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated :Mar 22, 2023, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.