ETV Bharat / state

'తెలుగు సాహిత్యం, భాషకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి సిరివెన్నెల'

author img

By

Published : Dec 11, 2022, 11:01 PM IST

Sirivennela Seetarama Sastry Samagra Sahitya Book: సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య రెండో, మూడో సంపుటాలను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు హాజరై.. సీతారామ శాస్త్రితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Sirivennela Seetarama Sastry Samagra Sahitya Book
Sirivennela Seetarama Sastry Samagra Sahitya Book

Sirivennela Seetarama Sastry Samagra Sahitya Book: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య పుస్తకావిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. నా ఉచ్చ్వాసం కవనం పేరిట సంపుటిని ఆవిష్కరించారు. తెలుగు సాహిత్యం కోసం తెలుగు సినిమాలు చూసేలా చేసిన గొప్ప వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని వక్తలు కొనియాడారు. సీతారామ శాస్త్రి పాటల్లో తెలుగు భాష వినియోగించిన తీరు అద్భుతమన్నారు. సిరివెన్నెల పాటలతో ఎందరో స్ఫూర్తి నిచ్చాయని, సమాజాన్ని మేల్కొలిపాయని ప్రశంసించారు.

'తెలుగు సాహిత్యం, భాషకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి సిరివెన్నెల'

సిరివెన్నెల పాటలను గ్రంథరూపంలో తేవడం హర్షణీయం.. గురజాడ, శ్రీశ్రీ వంటి వారు నాకు స్ఫూర్తి.. తెలుగు సాహిత్యం, భాషకు సిరివెన్నెల గుర్తింపు తెచ్చారు‌.. పాటల కోసమే సినిమాలు చూడాలనిపించేలా సిరివెన్నెల పాటలు రాశారు.. సిరివెన్నెల పాటలను వింటే ప్రశాంత కలిగేది.. చెడు సంకేతాలు ఇచ్చే సాహిత్యం జోలికి సిరివెన్నెల వెళ్లలేదు.. సిరివెన్నెల పాటల్లో సమాజం పట్ల బాధ్యత ఉంటుంది.. రాష్ట్రం విడిపోయాక తెలుగుసాహిత్య సమావేశాలు తగ్గిపోయాయి‌‌'. -జస్టిస్ ఎన్.వి.రమణ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

ఈ ఆవిష్కరణలో సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, బుర్రా సాయి మాధవ్​లు సిరివెన్నెలతో తమకున్న అనుబంధాన్ని సభలో పంచుకున్నారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులు, సినీ సాహిత్య ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.