ETV Bharat / state

'మహిళల రక్షణలో షీటీమ్స్ పనితీరు బాగుంది'

author img

By

Published : Oct 24, 2019, 6:07 PM IST

షీటీమ్స్​ ఏర్పడి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా...హైదరాబాద్ శిల్పాకళావేదికలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్​లు పాల్గొన్నారు. వారితోపాటు డీజీపీ మహేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు.

'మహిళల రక్షణలో షీటీమ్స్ పనితీరు బాగుంది'

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలో అన్నిప్రాంతాల్లో భరోసా కేంద్రాలను ఏర్పాటుచేస్తామని హోంమంత్రి వెల్లడించారు. మహిళల భద్రతకు ఏర్పాటైన షీటీమ్స్ ఐదో వార్షికోత్సవం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి మహమూద్‌ అలీ, మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. షీటీమ్స్ ఏర్పాటుతో మహిళలపై జరుగుతున్న నేరాలు చాలావరకు తగ్గాయని అభిప్రాయపడ్డారు.

విద్యాశాఖ తరఫున ప్రతి విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేయడానికి పూర్తిగా సహకరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కేసీఆర్ దిశానిర్దేశం చేసిన షీటీమ్స్‌ను పోలీసులు విజయవంతంగా ముందుకు తీసుకువెళుతున్నారని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దేశంలో తెలంగాణలో మాత్రమే మహిళల భద్రతకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

'మహిళల రక్షణలో షీటీమ్స్ పనితీరు బాగుంది'

ఇవీ చూడండి: హుజూర్​నగర్ ప్రజలకు రుణపడి ఉంటా: సైదిరెడ్డి

TG_Hyd_22_24_HM_On_She_Teams_AB_3182400 Reporter: Nagarjuna Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖను బలోపేతం చేయడం ద్వారా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని మహమూద్‌ అలీ చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఉందంటే ఇది ప్రభుత్వం, పోలీసుల వల్లనేనని ఆయన అన్నారు. మహిళల భద్రతకు ఏర్పాటైన షీటీమ్స్ 5వ వార్షికోత్సవం సందర్భంగా శిల్పకళావేదికలో పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మహమూద్‌ అలీ, మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. త్వరలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హోంమంత్రి వెల్లడించారు. పిల్లలు తల్లిదండ్రులతోపాటు షీటీమ్స్‌కు కూడా తమ బాధను చెప్పొచ్చనే ధైర్యాన్ని పోలీసు శాఖ ఇచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యాశాఖ తరపున ప్రతి పాఠశాలలో, కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు చేయడానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. కేసీఆర్ దిశా నిర్ధేశం చేసిన షీటీమ్స్‌ను పోలీసులు విజయవంతంగా ముందుకు తీసుకువెళుతున్నారని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దేశంలో తెలంగాణలో మాత్రమే మహిళల భద్రతకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. షీటీమ్స్ ఏర్పాటుతో మహిళలపై జరుగుతున్న నేరాలు చాలా తగ్గాయని...దీనిపై ప్రతి ఒక్కరిలో అవగాహన తీసుకురాగలిగామని డీజీపీ వివరించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు పోలీసులు 24/7 కృషి చేస్తున్నారని మహేందర్‌ రెడ్డి తెలిపారు. బైట్: మహమూద్ అలీ, హోంమంత్రి బైట్: సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బైట్: సత్యవతి రాథోడ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి బైట్: మహేందర్ రెడ్డి, డీజీపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.