ETV Bharat / state

ఆత్మనిర్భర్​ భారత్‌ పథకం కింద తెలంగాణకు ఏడువేల కోట్ల రుణం

author img

By

Published : Nov 3, 2020, 10:55 PM IST

Seven thousand crore loan to Telangana under Atmanirbhar Bharat scheme
ఆత్మనిర్భర్​ భారత్‌ పథకం కింద తెలంగాణకు ఏడువేల కోట్ల రుణం

ఆత్మనిర్భర్​ భారత్‌ పథకం కింద తెలంగాణకు ఏడువేల కోట్ల మొత్తాన్ని బ్యాంకులు రుణాలుగా ఇచ్చాయి. కొవిడ్‌ ప్రభావంతో స్తంభించిన వ్యవస్థలను ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్​ భారత్‌ పథకం... ఆర్థిక ప్యాకేజిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఆర్థికంగా ఆదుకున్నాయి.

కొవిడ్‌ మూలంగా ఆర్థికంగా చితికిపోయిన రంగాలను తిరిగి పునర్జీవింప చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆత్మనిర్భర్​ భారత్‌ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఏడువేల కోట్ల మొత్తాన్ని బ్యాంకులు రుణాలుగా ఇచ్చాయి. రైతులు, స్వయం సహాయక గ్రూపులు, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు మూడింటికి కలిసి రూ.6939 కోట్లు మొత్తాన్ని బ్యాంకులు రుణాలుగా ఇచ్చినట్లు బ్యాంకర్లు వెల్లడించారు.

ఆత్మనిర్భర్​ భారత్‌ పథకం ఆర్థిక ప్యాకేజీలో భాగంగా రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఈ మూడు వర్గాలను ఆర్థికంగా ఆదుకున్నాయి. ఆయా వర్గాలు తీసుకున్న రుణాల మొత్తంలో కొంత శాతాన్ని రుణాల కింద ఇవ్వాలని కేంద్రం బ్యాంకులను ఆదేశించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 2019-20 ఆర్థిక ఏడాదిలో తీసుకున్న రుణాలల్లో 20శాతం అంటే... దాదాపు తొమ్మిది వేల కోట్లు మొత్తం ఈ ఆత్మ నిర్భర భారత్‌ పథకం కింద రుణాలు ఇవ్వాల్సి ఉంది.

అయితే సెప్టెంబరు చివర వరకు 1.31లక్షలకుపైగా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు రూ.6,068 కోట్లు రుణాలను బ్యాంకులు ఇచ్చాయి. అదే విధంగా రైతులు తీసుకున్న రుణాల్లో పదిశాతం... ఈ పథకం కింద ఇవ్వాల్సి ఉండగా.... రుణాలు కావాలని బ్యాంకుల వద్దకు వచ్చిన 40వేలకుపైగా రైతులకు రూ.231 కోట్లకుపైగా మొత్తం రుణాలు ఇచ్చాయి. అదే విధంగా..రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లింపులు చేస్తున్న స్వయం సహాయక గ్రూపులకు పదిశాతం ఆత్మనిర్భర భారత్‌ పథకం కింద రుణాలు ఇచ్చారు.

సెప్టెంబరు నెల వరకు రాష్ట్రంలోని 1.12 లక్షల స్వయం సహాయక గ్రూపులకు రూ.620 కోట్లు రుణాలు ఇచ్చినట్లు బ్యాంకులు తెలిపాయి. ఇందులో దాదాపు 1,200 బ్యాంకు శాఖలు కలిగిన భారతీయ స్టేట్‌ బ్యాంకు అధికంగా రుణాలు ఇవ్వగా.... ఎక్కువ బ్యాంకు శాఖలు కలిగిన యూనియన్‌ బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.