ETV Bharat / state

ఆశలు రేపుతున్న కొవాగ్జిన్... రెండో దశ పరీక్షలకు అడుగులు

author img

By

Published : Aug 20, 2020, 8:30 AM IST

కరోనా టీకా విడుదలకు సంబంధించి కీలక ప్రక్రియలు ఒక్కోటిగా పూర్తవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ‘కొవాగ్జిన్‌’ క్లినికల్‌ ట్రయల్స్‌ నిమ్స్‌లో కొనసాగుతున్నాయి.

second-stage-of-covexin-trails
ఆశలు రేపుతున్న కొవాగ్జిన్... రెండో దశ పరీక్షలకు అడుగులు

కరోనా వైరస్​ను పారద్రోలేందుకు టీకాను తయారు చేయండంలో భారత్​ బయోటిక్​ కీలక దిశగా అడుగులు వేస్తుంది. కొవాగ్జిన్​ తొలి విడత క్లినికల్ ట్రయల్స్ ముగింపు దశలో ఉండగా... రెండో దశ పరీక్షలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబరు రెండో వారంలో ఇవి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిమ్స్‌ అధికార వర్గాలు వెల్లడించారు.

ఆరు నెలల పర్యవేక్షణ

దేశవ్యాప్తంగా భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో రెండో దశ పరీక్షలు నిర్వహిస్తారు. తొలి విడత పరీక్షల్లో 50 మంది వాలంటీర్లకు రెండు డోసుల వంతున టీకా అందించిన సంగతి తెలిసిందే. తొలి డోసు ఇచ్చిన 14 రోజుల తర్వాత అందరికీ బూస్టర్‌ డోస్‌ అందించారు. వారి రక్త నమూనాలను భారత్‌ బయోటిక్‌ ల్యాబ్‌తో పాటు పుణెలోని వైరాలజీ లేబొరేటరీ, ఐఎంఆర్‌కు పంపారు. వీటి ఫలితాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ 50 మంది ఆరోగ్య పరిస్థితిని దాదాపు ఆరు నెలల పాటు పర్యవేక్షించనున్నారు.

ఎంపిక చేసిన వారికే...

రెండో దశలో భాగంగా నిమ్స్‌లో 100 మంది వాలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తారు. ఇందుకు 18 - 65 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతులైన వ్యక్తులను వాలంటీర్లుగా ఎంపిక చేయనున్నారు. వారి నుంచి సేకరించిన రక్త నమూనాలను ఐసీఎంఆర్‌ గుర్తింపు పొందిన దిల్లీలోని ప్రయోగశాలకు పంపిస్తారు. వాటి ఆధారంగా ఉన్నతాధికారులు ఎంపిక చేసిన వాలంటీర్లకు టీకాలు వేస్తారు. ఆ తర్వాత మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలవుతాయి.

ఇదీ చూడండి: హైదరాబాద్​లో 6.6 లక్షల మందికి కరోనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.