ETV Bharat / state

భాజపా, మజ్లీస్‌లది తెరముందు కుస్తీ, తెరవెనుక దోస్తీ: రేవంత్​

author img

By

Published : Nov 19, 2020, 7:59 PM IST

కాంగ్రెస్​ పార్టీని బలహీనపరచడానికి తెరాస, భాజపా, ఎంఐఎం పార్టీలు ఒకే అజెండాగా పనిచేస్తున్నాయని ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్​ను అన్నివిధాలుగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్​ మాత్రమేనని స్పష్టం చేశారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో.. 'బస్తీ హమారా- బల్దియా హమారా' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

REVANTH REDDY
భాజపా, మజ్లీస్‌లది తెరముందు కుస్తీ, తెరవెనుక దోస్తీ: రేవంత్​

భాజపా, మజ్లీస్‌లది తెరముందు కుస్తీ, తెరవెనుక దోస్తీ: రేవంత్​

సీఎం కేసీఆర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిసి.. తెలంగాణ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెరాస, భాజపాలు కలిసి ఎంఐఎంను ఆటవస్తువుగా మార్చుకున్నాయని ఆయన విమర్శించారు. ఆ మూడు పార్టీలు ఒకే అజెండాతో పనిచేస్తున్నాయన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారని ఆరోపించారు.

భాజపా, మజ్లిస్​ పార్టీలది తెరముందు కుస్తీ, తెర వెనుక దోస్తీ అన్న చందంగా వారి స్నేహం ఉందని ఆరోపించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా భాజపా అధికారంలోకి వచ్చేందుకు మజ్లిస్‌ సంపూర్ణ సహకారం అందిస్తోందని.. దీనికి తెరాస సమన్వయం చేస్తోందని ఆరోపించారు. బిహార్‌ ఎన్నికల్లో అదే జరిగిందన్నారు. ఎంపీ అసదుద్దీన్​ జైలుకు వెళితే.. ఆయనకు బెయిల్​ ఇప్పించింది భాజపా నేత రఘునందన్ రావు కాదా అని రేవంత్​ ప్రశ్నించారు.

తన సంతకాన్ని పోర్జరీ చేశారని.. బండి సంజయ్​ ఆరోపిస్తున్నారని.. ఆ పార్టీకే చెందిన కేంద్ర సహాయ మంత్రి కిషన్​రెడ్డి.. ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. హిందుత్వ పార్టీ అని చెప్పుకొనే భాజపా నేతలు.. సచివాలయంలో వందేళ్ల చరిత్ర కలిగిన నల్లపోచమ్మ గుడిని కూల్చివేస్తే ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో.. 'బస్తీ హమారా- బల్దియా హమారా' అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ అన్ని విధాల అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుస్తామని రేవంత్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు

ఇవీచూడండి: హైదరాబాద్​లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.