ETV Bharat / state

'బీఆర్ఎస్​ తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు'

author img

By

Published : Oct 5, 2022, 3:21 PM IST

Updated : Oct 5, 2022, 5:00 PM IST

Revanth Reaction On Brs: భారత్‌ రాష్ట్ర సమితి పేరున జాతీయ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని కేసీఆర్‌ చంపేశారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు. కొన్ని రోజుల తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Revanth Reaction On Brs
Revanth Reaction On Brs

Revanth Reaction On Brs: భారత్‌ రాష్ట్ర సమితి పేరున జాతీయ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చంపేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహార శైలి ఉందని ధ్వజమెత్తారు. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను తామే పరిష్కరించుకుంటామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

2001 నుంచి 20022 వరకు కేసీఆర్ తెలంగాణ పేరుతో ఆర్థికంగా బలోపేతం అయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని ముఖ్యమంత్రి గ్రహించారని ఆక్షేపించారు. ఇకపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు రుణం తీరిపోయిందని విమర్శించారు. ఇందువల్లనే తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్​ఎస్​ను తీసుకొచ్చారని ఆరోపించారు. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని, ఆ పదాన్ని చంపేయాలనుకుంటున్న వ్యక్తి కేసీఆర్‌ అని విమర్శలు గుప్పించారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదని.. ఒక తెలంగాణ బిడ్డగా తాను కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఆయనలోని వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా కేసీఆర్‌కు అర్హత లేదన్న రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజలు ఈ విషయం ఆలోచించాలని సూచించారు. కొన్ని రోజుల తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని వ్యంగాస్త్రాలు సంధించారు. కేసీఆర్ లాంటి దుష్ట శక్తి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోవాలని సూచించారు. దసరా జమ్మి చెట్టు పూజల్లో కాగితంపై రాసి పెట్టాలని.. తాను కూడా జమ్మి చెట్టు పూజలో కాగితంపై రాసి దేవుడిని కోరుకుంటానని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

బీఆర్ఎస్​ తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు

"వినాశకాలే విపరీత బుద్ది. ఈరోజు తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారు. తెలంగాణలో తనకు తన ఎదుగుదలకు లేక తన ఆర్థిక రాజకీయాలకు కాలం చెల్లిందని కేసీఆర్​కు అర్ధమైపోయింది. ప్రజల ఎంతో గొప్పగా జైతెలంగాణ నినాదాలతో ప్రపంచ మొత్తం అబ్బురపడేలా పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ. ఆపేరు మీద ఇంతకాలం రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకున్న కేసీఆర్. ఈరోజు ఆపేరును మార్చడంతో తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు రుణం తీరిపోయింది. దీన్ని తెలంగాణ సమాజం హర్షించదు. ఈరోజు ఆయన కుటుంబంలో తగాదాలు తెంచుకోవడం కోసం లేదా రాజకీయం యొక్క దురాశను తీర్చుకోవడం కోసం భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు. తెలంగాణ మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం." -రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు

భారత్ రాష్ట్ర సమితి: తెరాసను జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తెరాస సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై తెరాస ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మారింది. రాష్ట్ర మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్‌పర్సన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. సభ్యులందరూ తీర్మానాలపై సంతకాలు చేశాక... మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు కేసీఆర్ సంతకం చేశారు. ఈ భేటీకి తమిళనాడులోని వీసీకే పార్టీ నేతలు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరయ్యారు.

ఇవీ చదవండి: తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇకపై భారత్ రాష్ట్ర సమితి

అన్ని వర్గాల వారికి వర్తించేలా.. ఓ 'జనాభా విధానం' ఉండాల్సిందే!: RSS చీఫ్​ మోహన్​ భాగవత్​

Last Updated : Oct 5, 2022, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.