ETV Bharat / state

రాయదుర్గం కిడ్నాప్​ కేసులో కొత్త ట్విస్ట్​ - సోదరే ప్రధాన సూత్రధారి

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 10:47 PM IST

Rayadurgam Kidnap Case
Rayadurgam Kidnap Case Update

Rayadurgam Kidnap Case Update : ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా, విలాసవంతంగా జీవించాలనుకుంది..అందుకు డబ్బుకోసం పెడదారి పట్టింది. బాగా సంపాదించే పెదనాన్న కొడుకునే కిడ్నాప్ చేయించిందో యువతి. ఏమీ తెలియనట్లు పోలీసుల ఎదుట నటించి, ఫిర్యాదు సైతం తానే ఇవ్వడం గమనార్హం. రాయదుర్గం ఠాణా పరిధిలో ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో యువతి సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఇద్దరు పరారీ ఉన్నట్లు తెలిపారు.

Rayadurgam Kidnap Case Update : ఈ నెల 4న సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం ఠాణా పరిధిలో ఐటీ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్(Kidnap) ఉదంతం కలకలం సృష్టించింది. పథకం ప్రకారం బాధితుడిని ఖాజాగూడ లేక్ వద్దకు తీసుకువచ్చిన బాధితుడు సురేందర్‌ను అప్పటికే వేచి ఉన్న నిందితుడు కారులో తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఆరు బృందాలను ఏర్పాటు చేసి ఆత్మకూర్ అటవీ ప్రాంతం సమీపంలో కిడ్నాపర్ల చెర నుంచి సురేందర్‌ను రక్షించారు.

నల్గొండ జిల్లాకు చెందిన గుర్రం సురేందర్ ప్రముఖ మీడియా(Media) గ్రూప్‌లో సాంకేతిక నిపుణులుగా పనిచేస్తున్నారు. సురేందర్ బాబాయి కుమార్తె నికిత గచ్చిబౌలిలోని ఫ్యాబ్రికాన్ ఐటీ సంస్థలో పనిచేస్తుంది. తాను పనిచేస్తున్న సంస్థలోనే సహోద్యోగిగా ఉన్న వెంకటకృష్టతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. వచ్చే చాలీచాలని ఆదాయంతో విలాస జీవితం గడపలేమని భావించి డబ్బున్న వారిని కిడ్నాప్‌ చేయాలని భావించారు. సురేందర్‌కు సంవత్సరానికి కోటి రూపాయల జీతం వస్తుందని నికిత వెంకటకృష్ణకు తెలిపింది. తనని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేద్దామని నికిత, వెంకటకృష్ణలు పథకం వేశారు. వెంకట కృష్ణకు గతంలో జైలుకు వెళ్లి వచ్చాడు. మరో నిందితుడు సురేశ్​ సాయంతో రాజు, రోహిత్‌, చందు, వెంకట్‌లతో కిడ్నాప్‌కు పథకం వేశారు.

Malkajgiri Boy Kidnap Case Updates : అప్పు తీర్చేందుకు ఇద్దరు.. చదువు కోసం మరొకరు.. చివరకు..!

New Twist in Rayadurgam Kidnap Case : సురేందర్‌ను నికిత అనుకున్న ప్లాన్‌ ప్రకారం మాట్లాడాలని చెప్పి ఖాజాగూడ లేక్ వద్దకు రప్పించింది. అప్పటికే కారులో వేచి ఉన్న సురేశ్​, రాజు, రోహిత్‌, చందు, వెంకట్‌లు నికితతో మాట్లాడుతుండగానే బలవంతంగా స్విప్ట్ కారులో ఎక్కించుకుని, శ్రీశైలం వైపు పరారయ్యారు. నికిత పోలీసుల ఎదుట ఏమి తెలియనట్లు వ్యవహరిస్తూనే కథ నడిపించింది. కారులో సురేందర్​ను కొడుతూ తీసుకెళ్లిన నిందితులు భార్యకు ఫోన్ చేసి రూ.2కోట్లు డిమాండ్ చేశారు.

Kidnap in Hyderabad : పోలీసులకు ఫిర్యాదు చేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని సురేందర్‌ చేత బలవంతంగా సందేశం పంపేలా చేశారు. నిందితులు ఆత్మకూరు ఫారెస్ట్ వద్ద అనుమతి లేకుండా వెళ్తుండటం చూసిన అధికారులు వారిని వెంబడించారు. పోలీసుల చూసి నిందితులు పారిపోతుండగా ఒక్కరిని పట్టుకుని, సురేందర్‌తో సహా రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. ఫారెస్ట్ అధికారులు సాయంతో మరో ముగ్గురిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం కేసులో నికిత సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 7 సెల్​ఫోన్లు స్వాధీనం చేసకున్నారు. కిడ్నాప్‌కి పాల్పడి డబ్బులు డిమాండ్ చేయడంలో సురేశ్​ ఆరితేరినట్లు పోలీసులు తెలిపారు.

జగిత్యాలలో బాలుడి అపహరణకు యత్నం - నిందితుడికి దేహశుద్ధి

Students Missing in Renjal : పదో తరగతి విద్యార్థినుల మిస్సింగ్.. ఇద్దరు యువకులపై కిడ్నాప్ కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.