ETV Bharat / state

Rajagopal Reddy Likely to Join in Congress : తిరిగి హస్తం గూటికి రాజగోపాల్​ రెడ్డి! నేడో, రేపో అధికారిక ప్రకటన!!

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 1:38 PM IST

Rajagopal Reddy to Join Congress
Rajagopal Reddy

Rajagopal Reddy Likely to Join in Congress : బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధమయ్యారు. ఇవాళ, రేపట్లో ఆయన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఆయన.. ఈ నెల 26, 27వ తేదీల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరతారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Rajagopal Reddy Likely to Join in Congress : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ(Telangana Congress Party)కి క్షేత్రస్థాయిలో ఊపురావడంతో ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా పెరిగాయి. అందులో భాగంగా చాలాకాలంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతూ వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి(Rajagopal Reddy)చేరిక విషయం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో అనేక సార్లు ప్రచారం జరిగినా.. ఆయన వాటిని ఖండిస్తూ వచ్చారు. కానీ ఈసారి మునుగోడు ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని చెబుతున్న రాజగోపాల్‌ రెడ్డి.. ఈసారి కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పెద్దలతో సంప్రదింపులు జరిపిన రాజగోపాల్‌ రెడ్డి.. ఈ నెల 26, 27వ తేదీల్లో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Komatireddy Rajagopal Reddy To join In Congress : మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి చేతిలో ఓటమి చెందిన రాజగోపాల్‌ రెడ్డి.. ఆ తర్వాత బీజేపీలో తనకు ఆశించిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తిగా ఉంటూ వచ్చారు. ఒకట్రెండు సార్లు ఆయన బీజేపీ పార్టీ తీరుపై కూడా ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. అప్పుడే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న బీజేపీ అధిష్ఠానం ఆయనను పిలిపించి మాట్లాడింది. ఆయనకు పార్టీలో పదవులు కూడా కట్టబెట్టింది. అయినా కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

Komatireddy Rajgopal Reddy Clarity on Contesting in Assembly Election : 'బీజేపీ తరపున మునుగోడు నుంచే పోటీ చేస్తా'

Rajagopal Reddy Disappointment With BJP First List : గతంలో మునుగోడుకు చెందిన ముఖ్య నాయకులతో చర్చించి తిరిగి కాంగ్రెస్‌లోకి వెళితే ఎలా ఉంటుందని అభిప్రాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో మెజారిటీ నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్లడం మంచిదని అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరొకసారి రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. తాజాగా బీజేపీ 52 మందితో మొదటి జాబితా(BJP MLA Candidates First List) ప్రకటించింది. కానీ అందులో మునుగోడుకు అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచింది. దీంతో రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. మరొకవైపు గడిచిన మూడు నాలుగు రోజులుగా ఆయన కాంగ్రెస్‌ పెద్దలతో సమావేశమై తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.

Telangana Congress Joinings News : ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమై చర్చించిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా గ్రీన్‌ సిగ్నిల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌ రెడ్డి పార్టీలో చేరిక వరకు సుముఖత వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ సీటు విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఇవాళ, రేపట్లో అది కూడా స్పష్టత వస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే మునుగోడులో చెలమల కృష్ణారెడ్డి, ఉప ఎన్నికల్లో ఓటిమి చెందిన పాల్వాయి స్రవంతి టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. వారిద్దరి టికెట్లపై పీఠముడి పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోకి రాజగోపాల్‌ రెడ్డి వచ్చినట్లయితే అయనకు టికెట్‌ ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీ వర్గాలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎల్బీనగర్‌ నుంచి ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ పోటీ చేస్తారని ఆయనకే టికెట్‌ దక్కుతుందని ప్రచారం జరుగుతుండడంతో.. అక్కడ టికెట్లు ఆశించిన మల్​రెడ్డి రామిరెడ్డి, జక్కిడి ప్రభాకర్‌ రెడ్డి, దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డిలు వ్యతిరేకిస్తున్నారు. గతంలో దిల్లీ పెద్దలను కలిసి మధుయాస్కీకి టికెట్‌ ఇస్తే తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీఆర్​ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి రామ్మోహన్‌ గౌడ్‌ చేరారు. ఈ నేపథ్యంలో మునుగోడులో కాకపోతే.. ఎల్బీనగర్‌ నుంచి అయినా రాజగోపాల్‌ రెడ్డిని బరిలోకి దించుతారన్న ప్రచారం కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది. ఇవాళ, రేపట్లో రాజగోపాల్‌ రెడ్డి అధికారికంగా ప్రకటన చేసినట్లయితే.. ఈ ప్రచారాలన్నింటికీ తెరపడే అవకాశం ఉంది.

Komatireddy Rajagopal Reddy : బీజేపీ జాతీయకార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Telangana Congress Joinings 2023 : కాంగ్రెస్​లో చేరికల జోరు.. రేపు హస్తం తీర్థం పుచ్చుకోనున్న మైనంపల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.