ETV Bharat / state

సివిల్స్​ ర్యాంకర్లకు సీపీ మహేశ్​ భగవత్​ సన్మానం

author img

By

Published : Sep 8, 2020, 6:13 PM IST

సివిల్స్​లో అర్హత సాధించిన ఇద్దరిని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ సన్మానించారు. సీపీ వీరిరువురికి ఇంటర్వ్యూ మెంటార్​గా వ్యవహరించారు.

rachakonda cp mahesh bhagavath felicitated to civils rankars in hyderabad
సివిల్స్​ ర్యాంకర్స్​ను సన్మానించిన మహేశ్​ భగవత్​

సివిల్స్​-2019లో అర్హత సాధించిన ఇద్దరిని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ సన్మానించారు. ఏపీలోని కడపకు చెందిన తాటిమాకుల రాహుల్‌ రెడ్డి, వరంగల్‌కు చెందిన బి. మిథున్‌రాజా యాదవ్​ను సత్కరించారు.

రాహుల్‌ రెడ్డి 117 ర్యాంకు సాధించగా.. మిథున్​రాజా యాదవ్​ 568వ ర్యాంకు సాధించారు. వీరిరువురికి ఇంటర్వ్యూ మెంటార్​గా సీపీ వ్యవహరించారు. యువత సివిల్స్​ వైపు దృష్టి సారిచాలని మహేశ్​ భగవత్​ అన్నారు.

ఇదీ చూడండి: సరిహద్దులో తొలిసారి మహిళా వైద్యుల సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.