ETV Bharat / state

ధ్యానమే విజయానికి దారి: పీవీ సింధు

author img

By

Published : Feb 9, 2020, 12:41 AM IST

పోటీల్లో గెలిచేందుకు ధ్యానం ఎంతో ఉపయోగపడిందని.. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. హార్ట్​ఫుల్​నెస్ ధ్యాన సంస్థ నిర్వహించిన 14వ జాతీయ స్థాయి వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. శాంతివనంలో జరిగిన ఈ కార్యక్రమానికి సింధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

kanha santhi vanam
ధ్యానమే విజయానికి దారి: పీవీ సింధు

మనసు ప్రశాంతంగా ఉంటేనే లక్ష్యాన్ని సాధించగలుగుతామని ప్రముఖ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. గెలుపు సులువుగా రాదని... శారీరకంగా, మానసిక శ్రమించాల్సిందేనని పేర్కొన్నారు. కన్హశాంతివనంలో జరిగిన 14వ జాతీయ స్థాయి వ్యాసరచన పోటీ విజేతల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. క్రీడాకారులకు ఏకాగ్రత చాలా అవసరమని... అది ధ్యానంతో సాధించవచ్చునని సింధు తెలిపారు.

హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన సంస్థ... యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఇండియా, భూటాన్ సంయుక్తంగా... దేశవ్యాప్తంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 25 వేల విద్యాసంస్థల నుంచి పది లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఎంపికైన 12 మందికి బహుమతులు ప్రదానం చేశారు. హార్ట్ ఫుల్ నెస్ 75వ వార్షికోత్సవం సందర్భంగా పలు కార్పొరేట్ సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు.

ధ్యానమే విజయానికి దారి: పీవీ సింధు

ఇదీ చూడండి: మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం

‍tg_hyd_63_08_SINDHU_ON_MEDITATION_AB_3064645 reporter: Nageshwara Chary note: ఫీడ్ డెస్క్ వాట్సప్ లో ఉంది. ( ) తన విజయాలకు ధ్యానం ఎంతో ఉపయోగ పడిందని.. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పేర్కొన్నారు. మనసు ప్రశాంతంగా ఉంటేనే లక్ష్యాన్ని సాధించగలుగుతామన్నారు. సక్సెస్ సులువుగా రాదని.. శారీరకంగా, మానసిక శ్రమించాల్సిందేనని సింధు అన్నారు. ఏడాదిగా తాను హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం చేస్తున్నాని... ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తోందని తెలిపారు. క్రీడాకారులకు ఏకాగ్రత చాలా అవసరమని... అది ధ్యానంతో సాధించవచ్చునన్నారు. హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన సంస్థ నిర్వహించిన 14వ జాతీయ స్థాయి వ్యాస రచన పోటీల్లో విజేతలకు హైదరాబాద్ లోని శాంతివనంలో జరిగిన బహుమతుల ప్రదానోత్సంలో సింధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన సంస్త... యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఇండియా అండ్ భూటాన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో సుమారు 25 వేల విద్యాసంస్థల్లోని పది లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఎంపికైన 12 మందికి సింధు బహుమతులు ప్రదానం చేశారు. హార్ట్ ఫుల్ నెస్ 75వ వార్షికోత్సవం సందర్భంగా పలు కార్పొరేట్ సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. బైట్ పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.