ETV Bharat / state

దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి నరసింహారావు - పీవీకి గవర్నర్​ సహా సీఎం, మంత్రుల ఘన నివాళులు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 12:57 PM IST

CM Revanth Reddy Tribute to PV Narasimha Rao
PV Narasimha Rao 19th Death Anniversary

PV Narasimha Rao 19th Death Anniversary in Hyderabad : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా గవర్నర్​ తమిళి సై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ప్రముఖ నాయకులు పీవీ ఘాట్​ వద్ద ఘన నివాళులు అర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పీవీ చేసిన సంస్కరణలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు.

PV Narasimha Rao 19th Death Anniversary in Hyderabad : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి వేళ హైదరాబాద్‌లోని 'పీవీ జ్ఞానభూమి' వద్ద గవర్నర్‌ తమిళిసై నివాళులు(Tamil Say Tributes to PV) అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు, పీవీ కుటుంబ సభ్యులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్‌ నేతలు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పీవీ చేసిన సంస్కరణలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు.

డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలి - ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే తప్పకుండా ఆదరిస్తారు : రేవంత్‌

CM Pays Tributes to PV Death Anniversary : పీవీ నరసింహారావును గుర్తు చేసుకున్న రేవంత్​ రెడ్డి దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి అని కీర్తించారు. పరిపాలనలో మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారన్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పేదలకు భూములు పంచడానికి బలమైన పునాదులు వేశారని తెలిపారు. ఆయన మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు.

పీవీ ఘాట్(PV Ghat Development in Hyderabad), జైపాల్ రెడ్డి ఘాట్​లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని రేవంత్​ రెడ్డి అన్నారు. వీరిద్ధరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వారి కీర్తిని పెంచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని రేవంత్​ రెడ్డి భరోసా ఇచ్చారు.

"దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు. పరిపాలనలో మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. పేదలకు భూములు పంచడానికి బలమైన పునాదులు వేశారు. పీవీ కీర్తిని పెంచేలా ప్రభుత్వం పని చేస్తుంది."- రేవంత్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి

  • ఆయన వ్యక్తిత్వం నిరాడంబరం
    ఆయన మేథస్సు శిఖరాగ్రం
    ఆయన చాణక్యం అసమానం
    మన కీర్తి పతాక… తెలంగాణ మట్టి బిడ్డ
    మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. pic.twitter.com/ZUVKPxWJ6x

    — Revanth Reddy (@revanth_anumula) December 23, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించి - రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు : సీఎం రేవంత్‌ రెడ్డి

Bhatti Vikramarka Tributes to PV Death Anniversary : దిల్లీలోని తెలంగాణ భవన్(Telangana Bhavan in Delhi)​లో పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమానికి హాజరై నివాళులర్పించిన అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీకే సొంతమని అన్నారు. విద్య వ్యవస్థ సహా అనేక సామాజిక మార్పులకు కృషి చేశారని వివరించారు. భూ సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి పీవీ నరసింహారావు అని ప్రశంసించారు.

రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా దిల్లీలో నూతన తెలంగాణ భవన్​ : సీఎం రేవంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.