ETV Bharat / state

రేపు హైదరాబాద్​కు ప్రధాని నరేంద్ర మోదీ.. ఏర్పాట్లలో బీజేపీ నేతలు బిజీబిజీ

author img

By

Published : Apr 7, 2023, 7:13 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
prime minister narendra modi

PM Modi Hyderabad tour tomorrow : ప్రధాని నరేంద్ర మోదీ రేపు(శనివారం) రాష్ట్రానికి రానున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన మోదీ పర్యటన ఎట్టకేలకు ఖరారు కావడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రేపు హైదరాబాద్ చేరుకోనున్న మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

రాష్ట్రంలో రేపు పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Modi Hyderabad tour tomorrow : రాష్ట్రంలో రేపు పర్యటించనున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు. 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. 7,864 కోట్లతో ఆరు జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అత్యాధునిక వసతుల కల్పనకు ప్రధాని రేపు భూమిపూజ చేయనున్నారు.

మోదీ పర్యటనలో అభివృద్ధి పనులు: రాష్ట్రంలో మరో ఆరు జాతీయ రహదారుల విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలోని పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్లను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఇంతక ముందే మంజూరు చేసింది. విస్తరణ ప్రణాళికలు కొలిక్కిరావటంతో పాటు భూసేకరణ ప్రక్రియ ఎక్కువ భాగం పూర్తి అయినందున శంకుస్థాపనకు జాతీయ రహదారుల సంస్థ సిద్ధమైంది. ఆరు రహదారుల విస్తరణకు రూ.7,864 కోట్లలతో వ్యయం కానుంది. పనులకు టెండర్ల ప్రక్రియను కూడా అధికారులు చేపట్టారు.

రెండో వందేభారత్​ రైలు ఏ సమయంలో అందుబాటులో ఉంటుంది: సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య రాకపోకలు సాగించనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపైకి వచ్చింది. రేపు సికింద్రాబాద్‌లోని ప్లాట్‌ఫామ్‌ 10 నుంచి ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌- తిరుపతి నగరాల మధ్య రాకపోకలు సాగించనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 3 నెలల వ్యవధిలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రంగంలోకి దిగిన ఎస్​పీజీ స్టేషన్‌ను అధీనంలోకి తీసుకుంది. 500 మంది అధికారుల పర్యవేక్షణలో భద్రత కొనసాగనుంది.

  • The augmenting of infrastructure at AIIMS in Bibinagar will benefit Telangana and add momentum to our ongoing efforts of creating a healthy India. https://t.co/5NW6Crqf30

    — Narendra Modi (@narendramodi) April 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎయిమ్స్​పై మోదీ ట్వీట్: మరోవైపు బీబీనగర్‌ ఎయిమ్స్‌లో మౌలిక సదుపాయాల కల్పన తెలంగాణకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆరోగ్య భారతదేశాన్ని సృష్టించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు మరింత ముమ్మరం కావడానికి దోహదపడుతుందని ఆయన ట్విటర్‌లో తెలిపారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అత్యాధునిక వసతుల కల్పనకు ప్రధాని భూమిపూజ చేస్తారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌లో వెల్లడించారు. ఎయిమ్స్‌ బీబీనగర్‌ భవిష్యత్తులో నిర్మిచిన తరవాత ఎలా ఉంటుందో తెలియజేసేందుకు నాలుగు ఫొటోలను జతచేశారు. ఈ ట్వీట్‌పై ప్రధాని స్పందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.