ETV Bharat / state

అంబులెన్సులు ఎక్కడ ఉన్నాయో తెలియదంటా..!

author img

By

Published : Dec 23, 2022, 1:25 PM IST

Poor performance of 108 and 104 ambulance call centers: ఆంధ్రప్రదేశ్‌లో 108, 104 అంబులెన్సుల కాల్‌ సెంటర్ల పనితీరు అంతంత మాత్రంగా తమారైంది. అంబులెన్సులు ఏ సమయంలో ఎక్కడ ఉన్నాయో? ఎటు పోతున్నాయో ? కూడా తెలపలేని పరిస్థితుల్లో కాల్‌ సెంటర్లు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాల్‌ సెంటర్ల నిర్వహణకు ఎంపిక చేసిన సంస్థకు ప్రతినెలా రూ.కోటీ 20 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. మూడు సంస్థలు కన్సార్టియంగా ఏర్పడి ఈ టెండరు దక్కించుకున్నాయి. కానీ వీటి సాంకేతిక వ్యవస్థ బలహీనంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పనితీరు వెంటనే మారకుంటే.. సంస్థ పేరును బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు వెనుకాడబోమని ఆరోగ్యశ్రీ అధికారులు హెచ్చరించారు.

108 and 104 ambulance call centers
108 and 104 ambulance call centers

Poor performance of 108 and 104 ambulance call centers: ఆంధ్రప్రదేశ్‌లో 108, 104 అంబులెన్సుల కాల్‌ సెంటర్ల పనితీరు అంతంత మాత్రంగా ఉంటోంది. ఈ అంబులెన్సులు ఏ సమయంలో ఎక్కడ ఉన్నాయో.. ఎటు పోతున్నాయో కూడా తెలపలేని, తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈ కాల్‌ సెంటర్ల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహనాల సేవలకు, కాల్‌ సెంటర్ల నిర్వహణకు విడివిడిగా టెండర్లు పిలిచింది. ఈ కాల్‌సెంటర్ల నిర్వహణకు ఎంపిక చేసిన సంస్థకు ప్రతినెలా రూ.1.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది.

ఇప్పటికి కాలం చెల్లిన వాహనాలే: మూడు సంస్థలు కన్సార్టియంగా ఏర్పడి ఈ టెండరు దక్కించుకున్నాయి. ఈ సంస్థ ద్వారా 108 వాహనాలు ఎప్పుడు? ఎక్కడ ఉన్నాయి? ఎంత సమయంలో కాల్‌ వచ్చిన ప్రాంతానికి పోతున్నాయి? అంబులెన్సులు ఏకకాలంలో ఎన్ని తిరుగుతున్నాయో తెలిపే సాంకేతిక వ్యవస్థ బలహీనంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాల్‌చేసిన వ్యక్తి ఉన్న ప్రాంత వివరాలు సైతం కాల్‌సెంటర్‌లోని సిస్టమ్‌పై సక్రమంగా కనిపించడంలేదని తెలిపాయి. దీనివల్ల ఆయా ప్రాంతాలకు సరైన సమయానికి వాహనం వెళ్లడంలో అవరోధాలు తలెత్తుతున్నాయని అధికారులు గుర్తించారు. 108 అంబులెన్సుల్లో కాలం చెల్లిన వాహనాలను ఇప్పటివరకు మార్చలేదు.

బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు వెనుకాడని ఆరోగ్యశ్రీ: 731 అంబులెన్సులు నడుస్తుండగా ఇందులో 336 వాహనాలు పాతవే ఉన్నాయి . వీటిలో 250 వాహనాలు అవసానదశలో అంతంత మాత్రంగా తిరుగుతున్నాయి. దీనికితోడు కాల్‌ సెంటర్‌ పనితీరు సరిగా లేనందున అంబులెన్సులు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాంతాలకు సకాలంలో చేరుకోవడంలో అడపాదడపా సమస్యలొస్తున్నాయి.104 అంబులెన్సుల నిర్వహణలో కాల్‌సెంటర్‌ పరంగా ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యంగా డ్యాష్‌బోర్డులో రోగుల వివరాల ప్రదర్శనలో సమస్యలు ఉన్నాయని తెలిసింది. కాల్‌సెంటర్ల పనితీరు వెంటనే మారకుంటే.. సంస్థ పేరును బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు వెనుకాడబోమని ఆరోగ్యశ్రీ అధికారులు హెచ్చరించారు.

వైద్య ఆరోగ్య శాఖ నుంచి పలుమార్లు ఇలాంటి హెచ్చరికలు వెళ్లినా పనితీరులో మార్పు కనిపించడంలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కాల్‌సెంటర్‌ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మూడు రోజుల కిందట ఆకస్మికంగా సందర్శించి సాంకేతికత వినియోగం సక్రమంగా లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సంస్థ ఏడేళ్ల ఒప్పందంతో టెండరు దక్కించుకోగా ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు దాటింది. అన్ని అంశాలనూ పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.