ETV Bharat / state

కాంగ్రెస్​ నేతలను అరెస్టు చేసిన పోలీసులు

author img

By

Published : Oct 1, 2020, 9:12 PM IST

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు పాశవికంగా దాడి చేశారని ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఉత్తరప్రదేశ్​లో దళిత యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్యచేశారని ఆయన విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనలకు నిరసనగా గాంధీభవన్‌ నుంచి బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన రేవంత్‌ రెడ్డి, అతని అనుచరులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

police-arrest-mp-revanth-reddy
కాంగ్రెస్​ నేతలను అరెస్టు చేసిన పోలీసులు

కాంగ్రెస్​ నేతలను అరెస్టు చేసిన పోలీసులు

ఉత్తర్‌ప్రదేశ్​లో రాహుల్ గాంధీపై పోలీసులు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా అందోళనకు దిగిన ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని హాథ్రస్‌ ఘటనలో మృతిచెందిన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్, ప్రియాంక గాంధీలను అడ్డుకుని వారిపట్ల అనుసరించిన వైఖరిని ఖండిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

గాంధీభవన్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ రోడ్డుపైకి వచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో భాజపా కార్యకర్తలు దూసుకు వచ్చి గగన్‌ విహార్‌కు ఎదురుగా కాంగ్రెస్ నేతలకు పోటీగా రోడ్డు మీద బైఠాయించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. భాజపా శ్రేణులనూ అక్కడి నుంచి తీసుకెళ్లారు. గాంధీభవన్‌, భాజపా కార్యాలయాల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు.

రేవంత్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు తరలించడం వల్ల ఎక్కడి వారు అక్కడ వెళ్లిపోయారు. మరోవైపు యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ భాజపా కార్యాలయం వైపు దూసుకొచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అనిల్‌కుమార్‌ యాదవ్‌ చొక్కా చిరిగిపోయింది. అనిల్‌కుమార్‌ యాదవ్‌తోపాటు పలువురు యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయం తరువాత దహన సంస్కారం చేయకూడదన్న కనీస ధర్మాన్ని కూడా పాటించకుండా అర్దరాత్రి దహనం చేశారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షంగా యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అడ్డుకుని, దారుణంగా ప్రవర్తించినట్లు విమర్శించారు.

ఇదీ చూడండి : డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి ముమైత్‌ఖాన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.