ETV Bharat / state

ఆ రెండు కేసులు.. టీఆర్ఎస్, బీజేపీల డ్రామా: రేవంత్‌రెడ్డి

author img

By

Published : Dec 5, 2022, 3:36 PM IST

Revanth reddy comments on trs and bjp మద్యం, ఎమ్మెల్యేలకు ఎర కేసులతో దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్- బీజేపీలు ఆ రెండుకేసులతో నాటకాలాడుతున్నాయని అభిప్రాయపడ్డారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు ధర్నా కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

PCC CHIEF REVANTH REDDY ON DELHI LIQUOR SCAM CASE
PCC CHIEF REVANTH REDDY ON DELHI LIQUOR SCAM CASE

Revanth reddy comments on trs and bjp దిల్లీలో లిక్కర్‌ స్కాం, గల్లీలో ఎమ్మెల్యేలకు ఎర కేసు గురించి అంతా మాట్లాడుతున్నారని... పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తప్పు చేయనివారు నిజాయితీ నిరూపించుకోవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే నాయకులు తెరాస, భాజపాలో లేరన్న ఆయన... గతంలో నిరుపేదలకు కాంగ్రెస్‌ భూ హక్కు పత్రాలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు ధర్నా కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ధరణి, భూ సంబంధిత సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

''రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరణి, భూ సంబంధిత సమస్యలను పరిష్కరించాలి. గతంలో నిరుపేదలకు కాంగ్రెస్‌ భూ హక్కు పత్రాలు పంపిణీ చేసింది. మన కల్చర్‌... అగ్రికల్చర్‌. చర్చంతా దిల్లీలో లిక్కర్‌ స్కాం, గల్లీలో ఎమ్మెల్యేలకు ఎర కేసు గురించే జరుగుతోంది. తప్పు చేయని వారు నిజాయతీ నిరూపించుకోవాలి. ప్రజా సమస్యలపై మాట్లాడే నాయకులు తెరాస, భాజపాలో లేరు. మద్యం, ఎమ్మెల్యేలకు ఎర కేసులతో దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. తెరాస-భాజపా నాటకాలాడుతున్నాయి.'' - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఆ రెండు కేసులు.. టీఆర్ఎస్, బీజేపీల డ్రామా: రేవంత్‌రెడ్డి

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.