ETV Bharat / state

సొంత పార్టీ కార్యాలయంపై దాడి చేసిన భాజపా కార్యకర్తలు

author img

By

Published : Nov 21, 2020, 9:49 PM IST

కుత్భుల్లాపూర్ భాజపా కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కార్యాలయంలోని ఫర్నీచర్​, అద్దాలు, టీవీలు, ఫ్యాన్లు తదితర వస్తువులను ధ్వంసం చేశారు. ఎందుకంటే..?

Attack on BJP party office
సొంత పార్టీ కార్యాలయంపై దాడి చేసిన భాజపా కార్యకర్తలు

హైదరాబాద్​ కుత్భుల్లాపూర్ భాజపా కార్యాలయంలో గాజులరామారం డివిజన్​ భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పార్టీ టికెట్​లను అమ్ముకున్నారని... కార్యాలయంలోని కుర్చీలు, టీవీలు, ఫార్నీచర్స్​ను ధ్వంసం చేశారు.

నియోజకవర్గం ఇంఛార్జ్​ కోలాన్​ హనుమంత్​రెడ్డి, జిల్లా అధ్యక్షులు హరీశ్​రెడ్డి, రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి, శంకర్​రెడ్డి తదితరులు కుత్భుల్లాపూర్​లో భాజపా టికెట్​లు అమ్మారని కార్యకర్తలు ఆవేదన చెందారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.