Shashi Tharoor: తెలంగాణ ఐటీ పాలసీ దేశంలోనే ఆదర్శం: శశి థరూర్

author img

By

Published : Sep 9, 2021, 9:00 PM IST

Shashi Tharoor on it policy

తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అధ్యక్షులు శశిథరూర్ కొనియాడారు. ఇలాంటి ఆదర్శవంతమైన పాలసీని రూపొందించిన రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ను అభినందించారు. దేశానికే దీన్ని ఒక ఉదాహరణగా నిలిపారని ఆయన ప్రశంసించారు.

తెలంగాణ ఐటీ పాలసీని ఇతర రాష్ట్రాలు నేర్చుకుని ప్రయోజనం పొందేలా ఉందని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అధ్యక్షులు శశిథరూర్ ప్రశంసించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఐటీ పాలసీ అద్భుతంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ఐటీ పాలసీని రూపొందించిన రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ను ఆయన కొనియాడారు. ఈ పాలసీ దేశానికే ఓ ఉదాహరణగా నిలిచిందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ఐటీపాలసీ అధ్యయనంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఆయన బృందం సమర్పించిన ప్రజంటేషన్ ఆద్యంతం ఆకట్టుకుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఐటీపాలసీ లాగే నేషనల్ ఫారిన్ పాలసీలో సైతం రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలని శశిథరూర్ అన్నారు. ఆయన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ సైతం సమర్థించారు. జాతీయ పాలసీల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరముందన్నారు. మీ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ అధ్యయనానికి తమవంతు సహకారం అందించినందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: KTR: హైదరాబాద్‌కు మరో బయోఫార్మా హబ్‌: మంత్రి కేటీఆర్‌​​​​​​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.