ETV Bharat / state

ORR Controversy Latest Updates : 'ఓఆర్‌ఆర్‌ వివాదం'పై HMDA లీగల్‌ నోటీసులు.. రేవంత్‌ సమాధానమిదే

author img

By

Published : Jun 13, 2023, 2:00 PM IST

Updated : Jun 13, 2023, 7:56 PM IST

HMDA Legal Notices to Revanthreddy on ORR Issue : ఓఆర్ఆర్ లీజు వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) లీగల్‌ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నోటీసులకు రేవంత్‌ సమాధానమిచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

ORR Controversy Latest Updates
ORR Controversy Latest Updates

Revanthreddy on HMDA Legal Notices : ఓఆర్‌ఆర్‌ లీజు విషయంలో తనకు ఇచ్చిన లీగల్‌ నోటీసును ఐఏఎస్ అధికారి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్ కుమార్ వెనక్కి తీసుకోకుంటే ఆయనపైనే సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. గత నెల 25న అర్వింద్‌ కుమార్‌ ఇచ్చిన లీగల్‌ నోటీసుకు ఇవాళ రేవంత్‌ రెడ్డి తన న్యాయవాది ద్వారా సమాధానం ఇచ్చారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్‌ నగర మెట్రోపాలిటన్ కమిషనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అర్వింద్‌ కుమార్‌.. సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను ఒక ప్రజాప్రతినిధిగా అడిగిన సమాచారం ఇవ్వకుండా.. రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Revanthreddy Responded on HMDA Legal Notices on ORR Issue : ఈ క్రమంలోనే ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్-1968 ప్రకారం.. ఐఏఎస్ అధికారి రాజకీయ ఉద్దేశాలు లేకుండా తటస్థంగా వ్యవహరించాల్సి ఉందని.. కానీ అర్వింద్ కుమార్ అధికార పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు సగ భాగం తాను ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుందన్నారు. అధిక ఆదాయం వచ్చే ఆవకాశం ఉన్నా.. ఆ దిశగా ఆలోచన చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి కేవలం రూ.7,380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు టెండర్‌ను కట్టబెట్టారని మండిపడ్డారు. అంతేకాకుండా ఐఆర్బీ టెండర్ కట్టబెట్టే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని, హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031తో ముగియనుండగా.. 30 సంవత్సరాలకు లీజుకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

2031 తర్వాత మాస్టర్ ప్లాన్ మారితే తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరిస్తారని నిలదీశారు. దేశంలో ఏ రహదారి టెండర్ అయినా.. 15 నుంచి 20 ఏళ్లకు మించి ఇవ్వలేదని, దీనిని 30 ఏళ్ల సుదీర్ఘ కాలానికి కాకుండా 15 నుంచి 20 ఏళ్ల వరకే టెండర్ వ్యవధి ఉండాలని నేషనల్ హైవేస్ ఆఫ్ ఇండియా చేసిన సూచనను కూడా పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారి స్థానంలో ఒక రిటైర్డ్ అధికారిని నియమించి ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియను పూర్తి చేశారని ఆరోపించారు. టెండర్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ స్థానంలో హెచ్ఎండీఏను తీసుకొచ్చారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఓఆర్‌ఆర్‌ టెండర్‌కు సంబంధించిన బేస్ ప్రైస్ ఎంతో వెల్లడించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. అర్వింద్ కుమార్ నుంచి ఎలాంటి స్పందన లేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తనకు పంపిన లీగల్ నోటీసులో తనపై పేర్కొన్న ఆరోపణలన్నీ బూటకమని పేర్కొన్నారు. అర్వింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధంగా ఉందన్నారు. అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న తనను అణచి వేసే దిశలోనే ఈ నోటీసు ఇచ్చినట్లు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి..

MLA Raghunandan Rao reacts on ORR lease issue : "సీబీఐకి ఫిర్యాదుచేశాం.. లీజుపై కేసీఆర్​ స్పందించాలి"

Kishan Reddy on ORR Lease : 'ఓఆర్‌ఆర్‌.. భవిష్యత్తులో కేసీఆర్‌కు ఏటీఎం'

Last Updated : Jun 13, 2023, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.