ETV Bharat / state

పీఎఫ్​ఐ కేసులో మరో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఎన్​ఐఏ

author img

By

Published : Mar 18, 2023, 7:46 AM IST

Etv Bharat
Etv Bharat

Popular Print of India case in TS: పాపులర్ ప్రంట్ అఫ్ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ మరో చార్జిషీట్ దాఖలు చేసింది. గతంలో 11 మందిపై అభియోగ పత్రాలు దాఖలు చేసిన ఎన్‌ఐఏ.. తాజాగా మరో ఐదుగురు నిందితులపై హైదరాబాద్ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసింది. అందులో పలు కీలక విషయాలను పేర్కొంది. ముస్లిం యువతకు శిక్షణ ఇచ్చి 2047 లోపు భారత్‌ను ఇస్లాం పాలిత దేశంగా మార్చే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది.

Popular Print of India case in TS: మత కలహాలు సృష్టించడం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో గతేడాది జులై 4న కేసు నమోదు అయింది. ఈ కేసులో అబ్దుల్ కాదర్, షేక్ సహదుల్లా, మహ్మద్ ఇమ్రాన్, అబ్దుల్ మోబిన్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరికొంత మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఆగస్టు 26న మరో కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురు ఇళ్లతో పాటు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. తెలంగాణాలో 38 చోట్ల, ఆంద్రప్రదేశ్‌లో రెండు ప్రాంతాల్లో ఈ దర్యాప్తు చేసింది.

11 మంది నిందితులపై అభియోగ పత్రాలు: తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేసిన అనంతరం ప్రధాన నిందితుడు అబ్దుల్ ఖాదర్​తో సహా 11 మందిని ఆరెస్ట్ ఎన్‌ఐఏ చేసింది. వారిని కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపింది. పలు కీలక పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లు, సీసీటీవీ దృశ్యాలు, సెల్‌ ఫోన్లు, రెండు కత్తులు, 8.31లక్షల నగదును జప్తు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు క్యాంపులు పెట్టి శిక్షణ ఇవ్వడం, మతకలహాలు సృష్టించేదుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. కేసు దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ.. డిసెంబర్‌లో 11 మంది నిందితులపై అభియోగ పత్రాలు దాఖలు చేసింది.

మరో 5 గురిపై అభియోగ పత్రాలు: తాజాగా మరో ఐదుగురిపై అభియోగ పత్రాలు దాఖలు చేసి కీలక ఆధారాలతో కూడిన చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించి. షేక్ రహీమ్, షేక్ వాహిద్, జఫ్రుల్లా ఖాన్‌ పఠాన్, షేక్ రియాజ్‌ అహ్మద్, అద్దుల్ వారిస్‌లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసింది. చార్జ్‌షీట్‌లో పలు కీలక అంశాలను పేర్కొంది. నిందితులు ముస్లిం యువతను ఆకట్టుకుని వారిని పీఎఫ్​ఐలోకి చేర్చుకొని.. క్యాంపులు నిర్వహిస్తున్నారని తెలిపింది. వారికి ఆయుధ, ఉగ్రవాద కార్యకలాపాలపై శిక్షణ ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. 2047లోపు భారత దేశాన్ని ఇస్లాం పాలిత దేశంగా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు అభియోగ పత్రాలలో ఎన్‌ఐఏ పేర్కొంది.

హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడ్డారు: ముస్లిం యువతకు రెచ్చగొట్టేందుకు భారత్‌లో ముస్లింల బాధలు తగ్గించేందుకు జిహాద్ అవసరమని నిందితులు యువతకు సందేశాలు పంపినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు పీఎఫ్​ఐ క్యాడర్ నిర్వహించిన శిక్షణా శిబిరాలకు వారిని పంపి.. గొంతు, కడుపు, తల వంటి ముఖ్యమైన శరీర భాగాలపై దాడి చేయడంలో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు పీఎఫ్​ఐపై వివిధ రాష్ట్ర పోలీస్​లు, జాతీయ ఏజెన్సీలు జరిపిన పరిశోధనలలో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలిందని చెప్పింది. దీంతో దాని అనుబంధ సంస్థలను గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర హోం శాఖ నిషేధించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.