సోనియా అపాయింట్‌మెంట్ కోరిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మర్రి శశిధర్​రెడ్డి

author img

By

Published : Aug 18, 2022, 1:43 PM IST

Updated : Aug 18, 2022, 3:39 PM IST

సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోరిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

13:40 August 18

సోనియా అపాయింట్‌మెంట్ కోరిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మర్రి శశిధర్​రెడ్డి

komatireddy venkat reddy కాంగ్రెస్​ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్, భువనగిరి ఎంపీ​ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సోనియా గాంధీ అపాయింట్​మెంట్​ కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన సోనియాకు వివరించనున్నారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి.. రాష్ట్ర నాయకత్వానికి మధ్య ఇటీవల జరుగుతోన్న కోల్డ్​ వార్ నేపథ్యంలో.. అధినేత్రి అపాయింట్​మెంట్​ కోరటం ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు జరుగుతున్న అవమానాల గురించి దిల్లీలోనే తేల్చుకుంటానని వెంకట్​రెడ్డి బహిరంగాగానే చెప్పిన సంగతి తెలిసిందే.

పార్టీలో తాజా పరిణామాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు సోనియాగాంధీతో పాటు రాహుల్‌, ప్రియాంక గాంధీలను కలువనున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌ల వైఖరిని తప్పుబడుతున్న వెంకటరెడ్డి రాష్ట్రంలో తాజా పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదిక ఇస్తానని తెలిపారు. పార్టీలో చేరికలు, మునుగోడు ఉప ఎన్నికలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకత్వంపై వ్యక్తమవుతున్న అసంతృప్తి గురించి వివరించనున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్​ నేత మర్రి శశిధర్​రెడ్డి సైతం సోనియాతో భేటీ అయ్యే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అధిష్ఠానానికి తెలియనీయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్న మర్రి.. తమ ఆవేదనను సోనియాకు వివరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సోనియాగాంధీని, రాహుల్‌ గాంధీలను కలిసి వివరించేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది.

రాహుల్‌ గాంధీకి తప్పుడు నివేదికలు..: రేవంత్‌రెడ్డి, మాణిక్కం ఠాగూర్‌ల గురించి మర్రి శశిధర్‌ రెడ్డి.. బుధవారం రోజున కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆ ఇద్దరు నేతలు అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ.. పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగేలా దిశానిర్దేశం చేయాల్సిన మాణిక్కం ఠాగూర్‌.. రేవంత్‌రెడ్డికి సహకరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదని మర్రి మండిపడ్డారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా కలత చెందుతున్నానని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని శశిధర్‌రెడ్డి ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలోనే మర్రి సోనియాతో భేటీ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇవీ చూడండి..

కాంగ్రెస్‌లో మరో అసమ్మతి స్వరం, పీసీసీ తీరుపై మర్రి శశిధర్‌రెడ్డి అసహనం

రాహుల్ గాంధీ దగ్గరనే తేల్చుకుంటానంటోన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

బిల్కిస్​ బానో ఘటనలో దోషుల విడుదలపై బాధితురాలు అసహనం

Last Updated :Aug 18, 2022, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.