Mothers Committed Suicide With Childrens మాతృ దినోత్సవం రోజునే ఇద్దరు మాతృమూర్తులు దారుణం ఒడిగట్టారు కంటికి రెప్పలా కాపాడాల్సిన పిల్లలనే ఆలూమగల మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలతో చేజేతులా హతమార్చుకున్నారు హైదరాబాద్ నగరంలోని లలితనగర్‌లో కుటుంబ కలహాలతో తమ ఇద్దరి కుమారులను నీటి టబ్బులో ముంచి అనంతరం ఆమె కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు ఆ చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా చిన్నారుల తల్లి పరిస్థితి మాత్రం విషయంగా ఉంది ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కుభ్య తండాకు చెందిన శ్రీనివాస్ భారతిలకు 2020లో వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమారులు కలరు శనివారం ఉదయం శ్రీనివాస్ తల్లి ఇంటికి వచ్చి ఆ పసిపిల్లలను ఎత్తుకునేందుకు ప్రయత్నించింది దీంతో భారతి అత్తతో తన పిల్లలను ముట్టుకోవద్దని గొడవ పెట్టుకుంది ఆ గొడవ కాస్త పెద్దదై భార్యాభర్తల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది ఇక్కడితో ఆగకుండా ఆమె తల్లిదండ్రులు ఇంటికి వస్తే వారి ముందు కూడా మరోసారి గొడవ పడ్డారని స్థానికులు తెలిపారుభర్తపై కోపంతో పిల్లల ప్రాణాలు తీసింది దీంతో భర్త ఇంటిని బయటకు వెళ్లిపోయాడు కోపంతో ఆ ఇల్లాలు తన ఇద్దరి పిల్లలను నీటి టబ్బులో ముంచి ఆ తర్వాత ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకొంది ఇదే విషయాన్ని భర్తకు ఫోన్ చేసి ఆమె చెప్పడంతో అతను వెంటనే వచ్చి ఇద్దరి పిల్లలను కొత్తపేటలోని ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయారని తెలిపారు ఆ తర్వాత ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది భర్త పెళ్లికి రాలేదని చిన్నారితో భార్య ఆత్మహత్య మరోవైపు ఓ గృహిణి తన పది నెలల చిన్నారితో సహా ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది హైదరాబాద్ బాకారం రాంనగర్‌కు చెందిన విజయసాగర్తో అంబర్ పేట్‌కు చెందిన విజయ వసంత కుమారికి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి 2022లో లేకలేక చిన్నారి జన్మించింది ఈ నెల మూడో తేదీన ఆమె తన అన్న వివాహానికి కేవలం తనకు మాత్రమే చెప్పి తన భర్తకు చెప్పకపోవడంతో ఆయన నిరుత్సాహానికి గురయ్యాడుఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది దీంతో ఇద్దరూ వివాహానికి వెళ్లలేదు ఈ విషయంపై తీవ్రమనస్తాపానికి గురైన వసంతకుమారి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి తనతో పాటు చిన్నారికి తాగించింది దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారుఇవీ చదవండిInhuman Incident in Langerhouse బతికున్నప్పుడు వేధించాడని చనిపోయాక మూడు ముక్కలుగాConstable Killed Wife at Vanasthalipuram దారుణం భార్య గొంతుకోసి మేడపై నుంచి నెట్టేసిన కానిస్టేబుల్