ETV Bharat / state

MLC Kavitha Fires on Congress : 'హైదరాబాద్ బిర్యానీ తిని వెళ్లండి.. ప్రజలను మభ్యపెట్టొద్దు'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 9:58 AM IST

MLC Kavitha Fires on Congress : బీజేపీతో అవగాహన కుదిరినందుకే.. సోనియా, రాహుల్‌గాంధీపై ఈడీ కేసులు ఏడాదిగా ముందుకు కదలడం లేదని బీఆర్​ఎస్​ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ ఏమయ్యిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య అవగాహనేమిటో బయట పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. సీడబ్ల్యుసీ సమావేశాలకు వస్తున్న రాజకీయ టూరిస్టులకు స్వాగతమంటూ ఎద్దేవా చేసిన కవిత.. హైదరాబాద్ బిర్యానీ తిని సంతోషంగా వెళ్లండి కానీ.. ప్రజల్ని మరోసారి మభ్యపెట్టొద్దని హితవు పలికారు.

Kavitha on CWC Meetings
Kavitha Fires on Congress

Kavitha Fires on Congress ప్రజలను మభ్యపెట్టొద్దు.. హైదరాబాద్​ బిర్యానీ తిని సంతోషంగా వెళ్లండి

MLC Kavitha Fires on Congress : రాహుల్ గాంధీపై మాట్లాడే స్థాయి లేదంటూ.. కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్​ నేత, ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా(Sonia Gandhi), రాహుల్​పై ఈడీ దర్యాప్తు ఏడాదిన్నరగా ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. సోనియా, రాహుల్, ఖర్గే, పవన్ బన్సల్​తో పాటు తెలుగు రాష్ట్రాల నేతలను ఏడాదిన్నర క్రితమే ఈడీ ప్రశ్నించిందని.. ఆ తర్వాత విచారణ ఏమయిందన్నారు. బీజేపీతో అవగాహన కుదిరినందుకే కాంగ్రెస్ నాయకులను.. ఈడీ విచారణకు పిలవడం లేదా..? అని కవిత(Kavitha) అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య అవగాహన ఏమిటో బయట పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.

MLC Kavitha On Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో.. ఒక్క విధానంతో బహుళ వైఖరి అవలంబిస్తోందని కవిత మండిపడ్డారు. ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని.. మరో రాష్ట్రంలో అవే పార్టీలను వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. ఒక ప్రాంతంలో ఆప్​తో కొట్లాడుతూ.. మరో చోట అదే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, ఛత్తీస్​గఢ్​లో అదానీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతూ.. ఇతర రాష్ట్రాల్లోనేమో వ్యతిరేకిస్తున్నారని ఆమె(BRS MLC Kavitha) విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరితమైన, ద్వంద్వ విధానాలు ప్రజలకు అర్థమైందన్నారు.

MLC Kavitha Responded to ED Notices : నాకు మోదీ నోటీసు వచ్చింది.. దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha on CWC Meeting 2023 : సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న సోనియా, రాహుల్(Rahul Gandhi), రాజకీయ టూరిస్టులకు స్వాగతమని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. హైదరాబాద్ బిర్యానీ తిని సంతోషంగా వెళ్లిపోవాలి కానీ.. మరోసారి రాష్ట్ర, దేశ ప్రజలను మభ్య పెట్టొద్దని ఆమె వ్యాఖ్యానించారు. ఇరవై ఏళ్లుగా పెండింగులో ఉన్న మహిళ రిజర్వేషన్ల బిల్లు(Women Reservation Bill)పై.. సోనియా, రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించాలంటూ ప్రతిపాదించిన తొమ్మిది అంశాల్లో మహిళ బిల్లును సోనియా ఎందుకు ప్రస్తావించలేదన్నారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడితే మద్దతు ఇస్తామని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీఆర్​ఎస్​ ప్రభుత్వం తీర్మానం చేసిందని కవిత పేర్కొన్నారు. ఇవాళ బీఆర్​ఎస్​ పార్లమెంటరీ పార్టీ తీర్మానం(BRS Parliamentary Meeting 2023) మరోసారి చేసిందని, సీఎం కేసీఆర్ కూడా లేఖ రాశారని పేర్కొన్నారు.

"నేషనల్​ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్​పై.. ఈడీ దర్యాప్తు ఏడాదిన్నరగా ముందుకు వెళ్లడం లేదు. ఎందుకలా.. ? కాంగ్రెస్​కు, బీజేపీకి మధ్య ఉన్న అవగాహన ఏంటో బయటపెట్టాలి. కాంగ్రెస్ బహుళ వైఖరిని అవలంభిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన, ద్వంద్వ విధానాలు ప్రజలకు అర్థమయ్యాయి. సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న రాజకీయ టూరిస్టులకు స్వాగతం.. హైదరాబాద్ బిర్యానీ తిని వెళ్లండి. ప్రజలను మభ్యపెట్టొదు". - కవిత, బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ

MLC Kavitha Fires on Rahul Gandhi : 'రాహుల్​ గాంధీ అప్​డేటెడ్​ లేని.. అవుట్​ డేటెడ్​ నాయకుడు'

MLC Kavitha Women's Bill 2023 : 'అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.