సమయం ఇవ్వడానికి నిరాకరించిన ఈడీ.. ఇక హాజరుకానున్న రోహిత్​రెడ్డి!

author img

By

Published : Dec 19, 2022, 11:19 AM IST

Updated : Dec 19, 2022, 2:21 PM IST

Pilot Rohit Reddy

Rohit Reddy ED Inquiry: ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట రోహిత్ రెడ్డి హాజరుకానున్నారు. అంతకు ముందు విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని ఈడీని కోరారు. కానీ అధికారులు అందుకు నిరాకరించారు.

Rohit Reddy ED Inquiry: మనీలాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు. నోటీసుల్లో అడిగిన వివరాల సేకరణకు మరికొంత సమయం పడుతుందని.. దీని కోసం ఒక వారం గడువు ఇవ్వాలని పీఏ శ్రవణ్‌ ద్వారా ఈడీ కార్యాలయానికి రోహిత్‌ లేఖ పంపించారు. కానీ గడువు ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించారు. దీంతో మధ్యాహ్నం 3గంటలకు ఈడీ కార్యాలయానికి రోహిత్‌ రెడ్డి హాజరుకానున్నారు.

హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సహాయ సంచాలకుడు దేవేందర్‌సింగ్‌ పేరిట శుక్రవారం అధికారులు రోహిత్‌రెడ్డికి సమన్లు జారీ చేశారు. రోహిత్‌ రెడ్డికి ఇచ్చిన నోటీసులో ఆధార్, పాన్‌కార్డ్‌, పాస్‌పోర్ట్‌తో పాటు.. తనకు, తన కుటుంబానికి చెందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, కంపెనీ వివరాలు తీసుకురావాలని కోరారు. ఆదాయపన్ను చెల్లింపులతో పాటు, ఇతర క్రయ విక్రయాలకు సంబంధించి గత ఏడేళ్ల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఈడీ విచారణకు ఈరోజు ఉదయం 10 గంటలకు రోహిత్‌ రెడ్డి హాజరుకావాల్సింది. ఈ నేపథ్యంలో వివరాల సేకరణకు సమయం పడుతుందని.. వారం గడువు ఇవ్వాలని కోరగా ఈడీ తిరస్కరించింది.

ఇవీ చదవండి:

Last Updated :Dec 19, 2022, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.