ETV Bharat / state

విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకోలో మంచిరెడ్డి

author img

By

Published : Dec 9, 2020, 11:37 AM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అబ్దుల్లాపూర్​మెట్​లోని విజయవాడ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి రాస్తారోకో నిర్వహించారు. కేంద్రం ఆవలంబిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కుతీసుకోవలని డిమాండ్​ చేశారు.

MLA Manchireddy
విజయవాడ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే మంచిరెడ్డి రాస్తారోకో

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అబ్దుల్లాపూర్​మెట్​లోని విజయవాడ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు.

రైతులకు మద్దతుగా తెరాస ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన చేయడం జరిగిందని వెల్లడించారు. కేంద్రం ఆవలంబిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కుతీసుకోవలని డిమాండ్​ చేశారు. రైతు నడ్డివిరిచే విధంగా ఉన్న ఈ చట్టాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ధర్నా చేస్తున్న క్రమంలో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

విజయవాడ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే మంచిరెడ్డి రాస్తారోకో

ఇదీ చూడండి: 98 మేజిక్‌ ఫిగర్‌ లేకుండానే మేయర్‌ ఎన్నిక...! ఎలాగంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.