ETV Bharat / state

'కేసుల సంఖ్య పెరగక ముందే చర్యలు తీసుకోండి'

author img

By

Published : Mar 23, 2021, 3:04 AM IST

కరోనా వ్యాప్తి చెందిన తర్వాత లాక్​డౌన్ విధించడం కంటే వైరస్​ విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే మంచిదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కొవిడ్​ కేసుల సంఖ్య పెరగకముందే నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

MLA Jaggareddy appealed to the government to take steps to control the corona
'కేసుల సంఖ్యపెరగక ముందే చర్యలు తీసుకోండి'

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ముందే వైరస్​ను నియంత్రించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. కొవిడ్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.

కరోనా వ్యాప్తి చెందిన తర్వాత లాక్​డౌన్ విధించడం కంటే ముందస్తు చర్యలు తీసుకోవడమే మేలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు. శ్రీరామ నవమి ఉత్సవాల విషయంలో గత ఏడాది మాదిరిగానే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. వివాహాలకు 50 మందికి, సామూహిక పండుగలకు పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతించేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదంవడి: పాఠశాలల కొనసాగింపుపై ప్రభుత్వం తర్జన భర్జన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.