ETV Bharat / state

'ఆ పదవి కోసం దిల్లీ వెళ్లి అధిష్ఠానానికి చెప్తా'

author img

By

Published : Jun 3, 2020, 6:35 AM IST

తెలంగాణ కాంగ్రెస్​ పార్టీలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ మొదలైంది. ఇతను సమర్థుడని ఒకరు, అతను సమర్థుడని మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిపై దిల్లీ వెళ్లి ఎవ్వరికీ ఇవ్వాలో సూచిస్తానని చెబుతున్నారు.

mla jagga reddy comments on telangana pcc president post
'ఆ పదవి కోసం దిల్లీ వెళ్లి అధిష్ఠానంకు చెప్తా'

దిల్లీ వెళ్లి ఎవ్వరికి పీసీసీ ఇవ్వాలో అధిష్ఠానంకు ముందే వెల్లడిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధినేతకు లేఖ రాస్తానని వెల్లడించారు. తాను మాట్లాడిన మాటలు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇబ్బంది కలిగించొచ్చని, అందుకే తనను మందలించినట్లు తెలిపారు. తెలంగాణ-కాంగ్రెస్​లో పీసీసీ పంచాయితీలు మాములేనని ఆయన వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్ష పదవి గురించి తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు.

మొన్న మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తెరాసలో కేసీఆర్​దే తుది నిర్ణయం-కాంగ్రెస్​లో అలా కాదన్నారు. ఇప్పట్లో ఉత్తమ్ కుమార్​రెడ్డిని పీసీసీ నుంచి ఇప్పుడు తొలగిస్తారని తానూ అనుకోనని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మందలిస్తే నేను ఎమీ ఇబ్బందికి గురికానని స్పష్టం చేశారు. తాను మాట్లాడినంత స్వేచ్ఛగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడలేరన్నారు.

ఇదీ చూడండి : రైతుల పట్ల అదనపు కలెక్టర్ దురుసు ప్రవర్తన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.