ETV Bharat / state

Vemula Prashanth Reddy: 'స్టాంపులు, రిజిస్ట్రేషన్​శాఖ కార్యాలయాల్లో వసతుల కల్పనకు చర్యలు'

author img

By

Published : Oct 8, 2021, 7:20 PM IST

vemula
vemula

రాష్ట్రంలో స్ట్రాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖకు చెందిన కార్యాలయాల్లో కనీస వసతుల కల్పనకు(minimum facilities) చర్యలు తీసుకుంటామని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి (vemula Prashanth reddy) అన్నారు. శాసన మండలిలో సభ్యులు వాణీదేవి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, బానుప్రసాద్​ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

'స్టాంపులు, రిజిస్ట్రేషన్​శాఖ కార్యాలయాల్లో వసతుల కల్పనకు చర్యలు'

రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖకు చెందిన కార్యాలయాల్లో కనీస వసతలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వేముల ప్రశాంత రెడ్డి అన్నారు. మొత్తం 141 సబ్‌ రిజిస్ట్రేసన్‌ కార్యాలయాల్లో కేవలం 8 కార్యాలయాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని, మిగిలినవన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నట్లు మంత్రి వివరించారు. మండలిలో సభ్యులు వాణీదేవి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, బానుప్రసాద్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

ఇప్పటికే 87 సబ్​రిజిస్ట్రార్‌ కార్యాలయాల భవనాల నిర్మాణం కోసం రూ.64.58 కోట్లు నిధులు మంజూరు చేశామని వివరించారు. 22 కార్యాలయాలు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చాయని... మరో 17 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. నాలుగింటిని ప్రభుత్వ కార్యాలయలకు షిఫ్ట్​ చేశామని... మరో నాలుగు భవనాలు దానం చేశారని రహదారులు భవనాల శాఖ వివరించారు. మిగిలినవి కూడా నిర్మాణం పూర్తయితే 53 భవనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. మరో 48 సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన వివరాంచారు. కడతాల్‌, అమన్‌గల్‌లో కొత్త సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఏర్పాటు గురించి ఆలోచిస్తామన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో తెలంగాణ ప్రాంతం దోపిడీకి, నిరాదరణకు గురైందని చెప్పడానికి సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయాలు కూడా ఓ ఉదాహరణ. రాష్ట్రంలో 141 సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయాలు ఉండగా.. సొంత భవనాలు ఉన్నవి కేవలం 8 మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 64.58కోట్ల రూపాయలతో 87 సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయాలు నిర్మించాలని సీఎం కేసీఆర్​ సూచించారు. వాటిలో 39 భవనాల నిర్మాణం పనులు మొదయ్యాయి. వాటిలో 22 భవనాలు పూర్తయ్యాయి. మిగతా 17భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్న 4 చోట్ల రిజిస్ట్రార్​ కార్యాలయాలను అక్కడికి తరలించాం. మరో రెండు ప్రైవేటు దాతలు ఇచ్చారు. మొత్తంగా 28 భవనాలు సిద్ధంగా ఉన్నాయి. మిగతా 17కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. మొత్తంగా 53 భవనాలు అందుబాటులోకి వస్తాయి.. ఇవికాకుండా మిగిలినవి కూడా త్వరలోనే పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.

-వేముల ప్రశాంత్​ రెడ్డి, రోడ్డుభవనాల శాఖ మంత్రి.

ఇదీ చూడండి: KTR on Urban Development: హైదరాబాద్​లో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నాం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.