ETV Bharat / state

Minister Mallareddy On Congress : 'వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​కు సిన్మా చూపిస్తాం'.. మంత్రి మల్లారెడ్డి కామెంట్స్

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 2:53 PM IST

Minister Malla Reddy  Fires on Congress
Minister Malla Reddy Rally in Hyderabad

Minister Malla Reddy Huge Rally in Malkajgiri : మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్​రెడ్డికి మల్కాజిగిరి బీఆర్ఎస్​ టికెట్‌ దాదాపు ఖరారు కావడంతో ఆయన ప్రచారం మొదలు పెట్టారు. మల్కాజిగిరి నియెజకవర్గలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో సిన్మా చూపిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Malla Reddy Comments కాంగ్రెస్​ నాయకులకు సీన్మా చూపిస్తానన్న మల్లారెడ్డి

Minister Malla Reddy Huge Rally in Malkajgiri : కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి(Marri Rajasekhar Reddy)కి మల్కాజిగిరి బీఆర్ఎస్​ టికెట్‌ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయన ప్రచారం ప్రారంభించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి, త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు. మైనంపల్లి రాజీనామాతో పలువురు అభ్యర్థులను పరిశీలన చేసిన పార్టీ అధినేత కేసీఆర్​.. మర్రి రాజశేఖర్‌రెడ్డికి స్పష్టమైన సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది.

Malkajgiri BRS MLA Candidate : మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి గత ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆ నియోజక వర్గంలో పరిస్థితులపై అవగాహన ఎన్నికల్లో ఉపయోగపడుతుందనే ఉద్ధేశంతో ఆ అభ్యర్థికి టికెట్​ ఇచ్చేందుకు సుముఖత చూపిందని పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు రాజశేఖర్‌రెడ్డికి ఎన్నికల్లో ఉపయోగపడతాయని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.

BRS MLA Candidates List 2023 : కొలిక్కివచ్చిన BRS MLA జాబితా.. మిగిలిన 4 స్థానాల్లో ఎవరో తెలుసా?

Marri Rajasekhar Reddy BRS Candidate in Malkajgiri : అధిష్ఠానం సూచనతో ప్రచారం ప్రారంభించిన రాజశేఖర్‌రెడ్డి.. నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తన మామ మంత్రి మల్లారెడ్డితో కలిసి వచ్చిన ఆయనకు నియోజకవర్గ బీఆర్​ఎస్​ శ్రేణులు స్వాగతం పలికారు. హైదరాబాద్​లోని ఆనంద్‌బాగ్‌ నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. డబ్బు కట్టలతో వస్తున్న కాంగ్రెస్‌ నేతల(Congress Leaders)ను నమ్మి మోసపోవద్దని మల్లారెడ్డి సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలకు సిన్మా చూపిస్తామని ఈ మామాఅల్లుళ్లు సవాల్‌ విసిరారు.

"కాంగ్రెస్​ నాయకులకు ఈ మామా అల్లుళ్ల సిన్మా చూపిస్తాం. ఈ రోజు ఈ ర్యాలీ ఇంత మంది వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కార్యకర్తలు అందరూ మరో 70 రోజులు కష్టపడాలి. అప్పుడే కాంగ్రెస్​ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చెయ్యాలి. కాంగ్రెస్​ నాయకులు అంటేనే మోసగాళ్లు. బీఆర్​ఎస్​ 2000 ఇస్తానంటే.. వాళ్లు 4000 ఇస్తానని అంటున్నారు. అలాంటి మాటలు నమ్మకండి. సీఎం కేసీఆర్​ కూడా నవంబర్ 16న వరాలు కురిపిస్తారు. మీ అందరికి బీసీ బంధు ఇస్తాం, దళిత బంధు ఇస్తాం. గృహలక్ష్మి పథకాన్ని రేపటి నుంచి ఇస్తాం."- మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బీఆర్​ఎస్​ ప్రభుత్వం 115 అభ్యర్థులను ఆగస్టు​లో ప్రకటించిన విషయం తెలసిందే. అనంతరంలో మిగిలిన మరో నాలుగు స్థానాలకి సంబంధించిన నలుగురు అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది. సదురు నాయకులకి అధిష్ఠానం సమాచారం ఇవ్వడంతో ప్రచార ఏర్పాట్లు చేసుకున్నారు. కాంగ్రెస్​ పార్టీ కూడా వచ్చే నెల మొదటి వారంలో తొలి విడత అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపింది. బీజేపీ తమ అభ్యర్దులను ఎంపిక చేసే ప్రక్రియలో ఉంది.

BRS Telangana Election Plan 2023 : ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సన్నద్ధం.. అసంతృప్తులను బుజ్జగించేందుకు కసరత్తులు..

BRS MLA Candidates Second List 2023 : కొలిక్కివచ్చిన BRS ఎమ్మెల్యే అభ్యర్థుల​ తుది జాబితా.. ఒకట్రెండు రోజుల్లో ఉత్కంఠకు తెర..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.