ETV Bharat / state

పెట్టుబడులకు సురక్షిత, లాభదాయక గమ్యస్థానంగా తెలంగాణ: కేటీఆర్‌

author img

By

Published : Dec 13, 2022, 8:14 AM IST

KTR participated in Tie Global Summit: 8 ఏళ్లలో తెలంగాణ ఎన్నో అద్భుతాలు సాధించిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేట్‌ రాకెట్‌ను తొలిసారి అంతరిక్షంలోకి పంపిన అంకురసంస్థ "స్కైరూట్" హైదరాబాద్‌కు చెందినదే కావడం గర్వకారణమని తెలిపారు. హైదరాబాద్‌లో మూడు రోజులపాటు జరగనున్న టై గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొన్న కేటీఆర్‌... యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు... పరిశ్రమల స్థాపనకు తెలంగాణ గమ్యస్థానంగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.

KTR participated in Tie Global Summit: మరో అంతర్జాతీయ సదస్సకు హైద‌రాబాద్ వేదికైంది. హెచ్​ఐసీసీలో మూడు రోజులపాటు జరగనున్న టై గ్లోబల్‌ సమ్మిట్‌ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో అడోబ్‌ సిస్టమ్స్‌ ముఖ్యకార్యనిర్వహణాధికారి శంతను నారాయణ్‌, గ్రీన్‌కో గ్రూపు ఎండీ, ముఖ్య కార్య నిర్వహణాధికారి అనిల్‌ కుమార్‌ సహా పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

17 దేశాల‌ నుంచి 150 మంది అంతర్జాతీయ వక్తలు.. 2500 మంది ప్రతినిధులు‌, 550కిపైగా టైచార్టర్‌ సభ్యులు.. 200కుపైగా పెట్టుబ‌డిదారులు అందులో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంకుర రంగంలో ఉన్న అవకాశాలపై చర్చలు కొనసాగనున్నాయి. 50 విభాగాల్లో 6,500 అంకురాల నిర్వహణతో... దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేటీఆర్‌ స్పష్టం చేసారు. పెట్టుబడులకు సురక్షిత, లాభదాయక గమ్యస్థానంగా ఉన్న తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున సంస్థలు ముందుకు రావాలని కోరారు. తెలంగాణను అంకుర రాష్ట్రంగా పిలవడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

ఆలోచన, మూలధనం, నైపుణ్యం... ఒక అంకుర సంస్థను స్థాపించేందుకు కీలకమని అడోబ్‌ ఛైర్మన్‌, సీఈవో శంతను నారాయణ్‌ పేర్కొన్నారు. సవాళ్లు ఎదురైనప్పుడే విజయాలు సాధించేందుకు మార్గం దొరుకుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వైద్యం సహా అనేక రంగాల్లో... కృత్రిమ మేధ కీలకం కాబోతుందన్న ఆయన... అడోబ్‌ అభివృద్ధి చేయబోతున్న కృత్రిమ మేధ పరిష్కారాలకు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. టై గ్లోబల్‌ సమ్మిట్‌లో... సీఈవో ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారం శంతను నారాయణ్‌ అందుకున్నారు. ఆర్థిక మాంద్యాన్ని ముప్పుగా భావించొద్దని.. వినూత్న ఉత్పత్తులకు సానుకూల అంశంగా పరిగణించాలని కంపెనీల నిర్వాహకులకు సూచించారు. తెలంగాణ పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక ఉత్పత్తులు ప్రపంచానికి విస్తరించాలన్నదే తమ లక్ష్యమని కేటీఆర్‌ తెలిపారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అడోబ్‌ క్యాంపస్‌కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

'ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తల పర్యావరణవ్యవస్థను పెంపొందించడంలో టై చురుకైన పాత్ర పోషిస్తోంది. ఆవిష్కరణల రంగానికి చక్కటి సహకారం అందిస్తోంది. టీహబ్‌, టీవర్క్స్‌, వీహబ్‌, టీఎస్‌ఐసీ తదితర సంస్థలు ఏర్పాటు చేసి గత 8ఏళ్లుగా తెలంగాణ సర్కారు యువ ఆవిష్కర్తలు తమ కలలు సాకారం చేసుకునేందుకు ప్రోత్సహిస్తోంది.'-కేటీఆర్‌, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి

'మీ దగ్గర ఒక అద్భతమైన ఆలోచన , మూలధనం, నైపుణ్యం ఉంటే అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో, మొత్తం దేశంలోనూ మీకు అవకాశాలుంటాయి. నేను ఇప్పుడొకటి నమ్ముతున్నాను. ఇప్పుడు డిజిటల్ రంగం ఎమవుతుందంటే.. డిజిటల్, టెక్నాలజీ, వైద్యం, విద్య... రంగం ఏదైనా వ్యవస్థాపకులుగా మారేందుకు అవకాశం ఉంది.'-శంతను నారాయణ్‌, అడోబ్‌ ఛైర్మన్‌, సీఈవో

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.