ETV Bharat / state

Minister Koppula Eshwar: 'ఏడాది చివరికల్లా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం'

author img

By

Published : Feb 6, 2022, 7:51 PM IST

Minister Koppula: భాజపా నేతలకు మొదటి నుంచి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిపోయిందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. దళితులు, బీసీ, ఎస్సీల పక్షాన ఏనాడు మాట్లాడని భాజపా నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆరోపించారు.

Minister Koppula
Minister Koppula

'ఏడాది చివరికల్లా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం'

Minister Koppula Eshwar: ఈ ఏడాది చివరికల్లా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. అంబేడ్కర్ విగ్రహం 125అడుగులు బేస్‌మెంట్‌ 50 అడుగులు కలిపి మొత్తంగా 175 అడుగులు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్‌ పక్కన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రదేశాన్ని ఎంపీ వెంకటేశ్‌తో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఏదీ ఏమైనా అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం జరిగి తీరుతుందన్నారు.

పవితమైన స్థలాన్ని భాజపా ఎంపీ బండి సంజయ్ సందర్శించి అపవిత్రం చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బండి సంజయ్‌కు, భాజపా నేతలకు మొదటి నుంచి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిపోయిందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ముఖ్యమంత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పినట్లు మంత్రి చెప్పారు. దళితులు, బీసీ, ఎస్సీల పక్షాన ఏనాడు మాట్లాడని భాజపా నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు.

సచివాలయం మీద మాట్లాడే భాజపా నేతలు.. రూ.20 వేల కోట్లతో పార్లమెంట్ ఎందుకు కడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సి వస్తే ఆర్టికల్ 368 ప్రకారం మార్చుకోవచ్చని చెప్పారని తెలిపారు. అదే విషయాన్ని సీఎం కేసీఆర్ చెప్పినట్లు గుర్తుచేశారు.

'పవితమైన స్థలాన్ని భాజపా ఎంపీ బండి సంజయ్ సందర్శించి అపవిత్రం చేశారు. బండి సంజయ్‌కు, భాజపా నేతలకు మొదటి నుంచి అబద్దాలు చెప్పడం అలవాటుగా మారిపోయింది. భాజపా దళిత వ్యతిరేక పార్టీ. ఈ ఏడాది చివరి నాటికి ముఖ్యమంత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. దళితులు, బీసీ, ఎస్సీల పక్షాన ఏనాడు మాట్లాడని భాజపా నేతలు దళితులపై మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సి వస్తే ఆర్టికల్ 368 ప్రకారం మార్చుకోవచ్చు. అదే విషయాన్ని సీఎం కేసీఆర్ చెప్పారు.'

-- కొప్పుల ఈశ్వర్, మంత్రి

రాజ్యాంగానికి అడ్డుపడిన చరిత్ర భాజపా నాయకులదని ఎంపీ వెంకటేశ్‌ నేతకాని ఆరోపించారు. శ్యామ్ ముఖర్జీ కూడా అంబేడ్కర్‌ను వ్యతిరేకించారని పేర్కొన్నారు. భాజపా నేతలకు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత, హక్కు కూడా లేదని మండిపడ్డారు. ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు? అంబేడ్కర్‌ను అవమానపరిచిన చరిత్ర భాజపా నాయకులదని విమర్శించారు.

'గత కొన్ని రోజులుగా మతోన్మాద భాజపా ఎంపీలు అరుస్తున్నారు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. భాజపా నేతలకు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత, హక్కు కూడా లేదు. ఏడున్నరేళ్లలో భాజపా ఏం చేసింది? అంబేడ్కర్‌ను అవమానపరిచిన చరిత్ర భాజపా నాయకులది.'

-- వెంకటేశ్‌ నేతకాని, ఎంపీ

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.