ETV Bharat / state

కరోనా బాధితులకు ఇంటివద్దే చికిత్స: మంత్రి ఈటల

author img

By

Published : Jun 10, 2020, 5:38 PM IST

జిల్లా వైద్యాధికారులు, సూపరింటెండెంట్లు మంత్రి ఈటల రాజేందర్​ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రోగ్రామ్ ఆఫీసర్స్, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.

Minister eetala rajender conduct video conference with officials
'కరోనా లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తులకు ఇంటి వద్దే చికిత్స'

కరోనా లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తులకు ఇంటివద్దే చికిత్స అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. వారిని జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌లో ఉంచాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గాంధీకి పంపించాలని తెలిపారు.

జిల్లా వైద్యాధికారులు, సూపరింటెండెంట్లు మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రోగ్రామ్ ఆఫీసర్స్, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై దృష్టిపెట్టాలని ఆదేశించిన మంత్రి... అన్ని ఆసుపత్రుల్లో ఫీవర్, సాధారణ ఓపీలు ఉండాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: జీహెచ్ఎంసీలో కేంద్ర బృందం.. కరోనాపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.