ETV Bharat / state

తృణధాన్యాల విత్తనాలకు పెరిగిన డిమాండ్

author img

By

Published : Jul 31, 2019, 2:19 PM IST

తగ్గిన వర్షాభావంతో ఈ ఏడాది ఎక్కువమంది రైతులు తృణధాన్యాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా వీటి విత్తనాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. రాష్ట్రంలో మారిపోతున్న ఆహారపు అలవాట్లు, అభిరుచుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతుల డిమాండ్ దృష్టిలో పెట్టుకుని తొలిసారిగా వ్యవసాయ శాఖ రాయితీపై విత్తనాలు విక్రయించింది.

తృణధాన్యాల విత్తనాలకు పెరిగిన డిమాండ్

తృణధాన్యాల విత్తనాలకు పెరిగిన డిమాండ్

రాష్ట్రంలో సామలు, కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జలు... ఈ తృణధాన్యాల పంటల సాగు గణనీయంగా పెరుగుతోంది. విప్లవాత్మక వాతావరణ మార్పులు, మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, అభిరుచులతో చిరుధాన్యాలకు ఎనలేని డిమాండ్ ఉంటోంది. పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, అంకుర కేంద్రాల నిర్వాహకులు గ్రామాల్లో నేరుగా రైతులను సంప్రదిస్తున్నారు. తిరిగి కొనుగోలు - బై బ్యాక్ ఒప్పందాలు చేసుకుంటూ సాగుకు అన్ని రకాలుగా సాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఇప్పటికే రాయితీపై 310 క్వింటాళ్ల విత్తనాలను వ్యవసాయ శాఖ తరఫున విక్రయించింది.

తృణధాన్యాల పైరు సాధారణ విస్తీర్ణం గతేడాది వరకు గరిష్ఠంగా 526 ఎకరాలే ఉండేది. ప్రస్తుత కాలంలో సాగు ఎక్కువగా పెరగడం వల్ల ఎంత విస్తీర్ణంలో వేశారన్నది గ్రామాల వారీగా లెక్కలు తీస్తున్నారు. ఈసారి 50వేల ఎకరాలకు ఉంటుందని అంచనా.

90శాతం రాయితీ

ఓ స్వచ్చంధ సంస్థ... తృణధాన్యాల పంటల విత్తనాలు ఉచితంగా అందజేసి ఇప్పటికే వెయ్యి ఎకరాలు సాగు చేయిస్తోంది. వీటి సాగు పెంచేందుకు వ్యవసాయ శాఖ విత్తన ధరలో ఏకంగా 65 శాతం రాయితీ కల్పిస్తోంది. మరోవైపు కేంద్రం కూడా ఈ పంటలనే ప్రోత్సహించేందుకు జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద మరో 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం విత్తన ధరలో మొత్తం 90 శాతం రాయితీ ఇస్తున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది.

టీఎస్ సీడ్స్ తరఫున విక్రయించిన రాయితీ విత్తనాలతో సాగు చేసిన పంటలను తిరిగి కొనేందుకు బై బ్యాక్ ఒప్పందాలు చేసుకోవాలని ప్రణాళిక సిద్ధమవుతోంది. వచ్చే ఏడాదికి విత్తనాలు అవసరమని ఈ పంటలను తిరిగి కొంటున్నట్లు ఆ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.

ఇవీ చూడండి: చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.