ETV Bharat / state

'రెండో దశ మెట్రో రైలు విస్తరణ చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంటుంది'

author img

By

Published : Dec 2, 2022, 8:18 PM IST

metro rail expansion work program Talasani comments
మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​

Metro rail expansion work program: రూ.6,250 కోట్ల వ్యయంతో 31 కిలో మీటర్ల మేర నిర్మించనున్న ఈ మెట్రో రైలు రెండో దశ విస్తరణ.. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్​ ఈ నెల 9వ తేదీన మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు.

Metro rail expansion work program: రెండో దశ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు ఎంతో గొప్పదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ఆయన హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్​, టీఆర్​ఎస్​ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిలతో సమావేశం నిర్వహించారు. రూ.6,250 కోట్ల వ్యయంతో 31 కిలో మీటర్ల మేర నిర్మించనున్న ఈ మెట్రో రైలు రెండో దశ విస్తరణ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఈ ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్​ ఈ నెల 9వ తేదీన మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. శంఖుస్థాపన అనంతరం రాజేంద్రనగర్​లో ఉన్న తెలంగాణ పోలీస్​ గ్రౌండ్స్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, ప్రసగించనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నగరంలోని అన్ని నియోజక వర్గాల నుంచి టీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఈ రెండోదశ మెట్రో రైలు లైన్​ ప్రారంభమైతే.. శంషాబాద్​ వైపు వెళ్లే విమాన ప్రయాణికులు, ఐటీ కారిడార్​కి వెళ్లే ఉద్యోగులకు, ఇంకా చాలా మందికి అనేక రకాలుగా ఉపయోగ పడుతుందని తెలిపారు. వీరి అందరికీ ట్రాఫిక్​ నుంచి విముక్తి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ప్రభాకర్ రావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్​, దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, సాయన్న తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.