ETV Bharat / state

భాగ్యనగరంలో ఎర్డీబర్డ్​కు భారీ స్పందన

author img

By

Published : May 31, 2020, 1:25 PM IST

early bird concept works on property tax payment
హైదరాబాద్​లో ఎర్డీబర్డ్​కు అధిక స్పందన

ఆస్తి పన్ను చెల్లింపుల కోసం ప్రకటించిన ఎర్డీ బర్డ్​ పథకానికి హైదరాబాద్​లో మంచి స్పందన లభిస్తోందని నగర మేయర్​ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఇవాళ అర్థరాత్రి 12 గంటల వరకు ఎర్లీ బర్డ్​ కింద 5 శాతం రాయితీతో ఆన్​లైన్​లో ఆస్తిపన్ను చెల్లించవచ్చని మేయర్ తెలిపారు.

ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపుల కోసం ప్రకటించిన ఎర్లీ బర్డ్​ పథకానికి హైదరాబాద్​ నగరంలో మంచి స్పందన లభిస్తోందని జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ పేర్కొన్నారు. నివాస గృహాలతో పాటు వాణిజ్య ఆస్తులకు ఎర్లీ బర్డ్​ పథకం కింద 5 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

2020-21 మే నెలఖరు వరకు రూ. 522 కోట్లు

2019-20 మే నెలాఖరు వరకు రూ. 567 కోట్లు

ఇవాళ రాత్రి 12 గంటల వరకు ఎర్లీ బర్డ్​ కింద 5 శాతం రాయితీతో ఆన్​లైన్​లో ఆస్తిపన్ను చెల్లించవచ్చని మేయర్ తెలిపారు. మీసేవ, సిటిజన్ సర్వీస్​ సెంటర్లు సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయని... ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. గతేడాది కంటే ఆస్తి పన్ను అధికంగా వసూలు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: త్రిశూల వ్యూహంతో లాక్​డౌన్​ 5.0- కొత్త రూల్స్​ ఇవే...

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.