ETV Bharat / state

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు చేర్చేందుకు తెరాస యత్నం'

author img

By

Published : Oct 3, 2020, 3:40 PM IST

marri shashidhar reddy said trs party tries to get bogus votes in MLC elections
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు చేర్చేందుకు తెరాస యత్నం'

జీహెచ్ఎంసీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. అఖిలపక్ష భేటీకి జిల్లా ఎన్నికల అధికారి రాకపోవడం సరికాదని కాంగ్రెస్​ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మార్చకుండా ఆర్డినెన్స్ తెచ్చే యత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి రిజర్వేషన్లు సరిచేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు చేర్చేందుకు తెరాస యత్నం'

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా బోగస్ ఓట్లను చేర్చేందుకు తెరాస ప్లాన్ చేస్తుందని విపక్ష నేతలు ఆరోపించారు. గ్రేటర్​లో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్​లో తెరాస, మజ్లిస్​కు లబ్ది కలిగేలా అధికారులు వ్యవహరిస్తున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో ఎలాక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి పంకజ సమావేశం నిర్వహించారు.

గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారకుండా, ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలోనే రిజర్వేషన్లు అడ్డగోలుగా జరిగాయన్నారు. ఈసారి రిజర్వేషన్లు సరి చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రాకపోవడం దారుణమని మర్రి అన్నారు. ఈవీఎం, బ్యాలెట్ రెండింటితోనూ ముప్పు ఉందన్నారు. నిపుణులతో చర్చించి దేని ద్వారా తక్కువ నష్టం ఉంటే వాటి ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

ఇదీ చూడండి : రికార్డు స్థాయిలో వానాకాలం పంటలసాగు.. ఆనందంలో రైతన్నలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.