ETV Bharat / state

రాజకీయ లబ్ధి కోసమే కేంద్రంపై తెరాస ఆరోపణలు: కె.లక్ష్మణ్

author img

By

Published : Oct 29, 2022, 5:22 PM IST

Updated : Oct 29, 2022, 8:30 PM IST

Laxman fires on Telangana Government
Laxman fires on Telangana Government

Laxman Fires On Telangana Government: చేనేత కార్మిక సంఘాలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నిలదీశారు. టేస్కోకు ఛైర్మన్, డైరెక్టర్‌ లేకుండా మీరెందుకు పెత్తనం చెలాయిస్తున్నారని.. సీఎం కేసీఆర్​ను ఉద్దేశించి ప్రశ్నించారు. గతంలో అప్కో ద్వారా నామమాత్రపు వడ్డీతో నేతన్నలకు రుణాలు లభించేవని లక్ష్మణ్ గుర్తు చేశారు.

Laxman Fires On Telangana Government: మునుగోడు ఉప ఎన్నికల దృష్ట్యా చేనేత ఓటర్లను తెరాస తప్పుదారి పట్టిస్తుందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై తెరాస ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వం 5 శాతం చేనేత పన్నుకు అంగీకరించి సంతకాలు చేసిందని తెలిపారు. ప్రభుత్వానికి చేనేత కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే 5 శాతం జీఎస్టీలో రాష్ట్ర వాటా 2.5 శాతం వదులుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.

చేనేత కార్మిక సంఘాలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్నిలక్ష్మణ్ ప్రశ్నించారు. టేస్కోకు ఛైర్మన్, డైరెక్టర్‌ లేకుండా మీరెందుకు పెత్తనం చెలాయిస్తున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఉద్దేశించి నిలదీశారు. గతంలో అప్కో ద్వారా నామమాత్రపు వడ్డీతో నేతన్నలకు రుణాలు లభించేవని గుర్తు చేశారు. టెస్కోకు ఛైర్మెన్, డైరెక్టర్ లేకపోవడంతో.. విధిలేని పరిస్థితుల్లో బ్యాంక్ ద్వారా అధిక శాతం వడ్డీకి చేనేత కార్మికులు రుణాలు తీసుకుంటున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.

రాజకీయ లబ్ధి కోసమే కేంద్రంపై తెరాస ఆరోపణలు: కె.లక్ష్మణ్

"మునుగోడు ఉపఎన్నికల దృష్ట్యా తెరాస పార్టీ పెద్ద సంఖ్యలో చేనేత కార్మికుల యొక్క ఓట్లను దృష్టిలో పెట్టుకొని వారిని తప్పుదారి పట్టించే కుట్రలు పన్నుతోంది. 5 శాతం జీఎస్టీ పన్ను అని భాజపాపై పదే పదే నిందలు మోపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 5 శాతం జీఎస్టీలో పన్నుకు అంగీకరించారు. తీరా ఇప్పుడు ఓట్ల కోసం భాజపాపై నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు." - లక్ష్మణ్ భాజపా రాజ్యసభ సభ్యుడు

ఇవీ చదవండి: ఆ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్​లు ఎందుకు సీజ్​ చేయలేదు?: రేవంత్‌రెడ్డి

ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ మన రక్షణశాఖే.. ఉద్యోగులు ఎంతమందో తెలుసా?

Last Updated :Oct 29, 2022, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.