ETV Bharat / state

గ్రేటర్​లో ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్​

author img

By

Published : Jan 12, 2021, 11:36 AM IST

ktr
గ్రేటర్​లో ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్​

గ్రేటర్​లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభమైంది. రహమత్‌నగర్‌లో మంత్రి కేటీఆర్.. ఉచిత తాగునీటి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ రామ్మోహన్, సీఎస్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభమైంది. రహమత్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఇంటింటికి జీరో నీటి బిల్లులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ రామ్మోహన్, సీఎస్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు.

ఒక్కో కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా సరఫరా చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ మేరకు పథకం ప్రారంభించారు. బస్తీల్లో నల్లాలకు మీటర్లు లేకున్నా ఉచితంగా తాగునీటి సరఫరా చేయనున్నారు. అపార్టుమెంట్లలో నీటిమీటర్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది. 20వేల లీటర్లు దాటితే పాత ఛార్జీలతో నీటిబిల్లుల వసూలు చేస్తారు.

ఈ పథకంతో జంట నగరాల్లో మొత్తం 10.08 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే ఉచిత తాగునీటి పథకం మార్గదర్శకాలు విడుదల చేశారు. జ‌న‌వ‌రిలో జారీచేసే డిసెంబ‌రు బిల్లు నుంచే పథ‌కం వర్తించనుంది. మురికివాడలు, బస్తీలలో నల్లా కనెక్షన్లకు ఉచితంగా తాగునీరు పంపిణీ చేయనున్నారు. నల్లాలకు మీటర్లు లేకున్నా డాకెట్ ఆధారంగా నీటిబిల్లు వసూలు చేస్తారు. గృహాలకు నీటి వినియోగం కోసం మీటర్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. నెలలో 20 వేల లీటర్లు దాటితే ప్రస్తుత టారీఫ్ ప్రకారం బిల్లు వేస్తారు. అపార్టుమెంట్లలోని ఒక్కో ఫ్లాటుకు 20వేల లీటర్ల నీళ్లు పంపిణీ చేస్తారు. 10 ఫ్లాట్లు ఉన్న అపార్టుమెంట్‌కు నెలకు 2 లక్షల లీటర్లు ఉచితంగా సరఫరా చేయనున్నారు. గ్రేటర్‌లో 10.08 లక్షల నల్లా కనెక్షన్లలో 2.37 లక్షల నల్లాలకే మీటర్లు ఉన్నాయి. ఉచిత తాగునీటి పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.19.92 కోట్లు ఆదా కానుంది. మీటర్లు ఏర్పాటు చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువునిచ్చింది ప్రభుత్వం. జలమండలి సూచించిన ఏజెన్సీల ద్వారా వాటర్ మీటర్ల ఏర్పాటు చేయనున్నారు. పథకానికి ఆధార్‌కార్డును లింక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. వినియోగదారులు తమ క్యాన్ నంబర్లతో ఆధార్ లింక్ చేసుకోవాలన్నారు. www.hyderabadwater.gov.in వెబ్‌సైట్‌లో ఆధార్ లింక్ చేసుకోవచ్చని సూచించారు.

  • మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్లు 155313, 040-23433933
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.