Lal Darwaza Bonalu: వైభవంగా లాల్ దర్వాజ బోనాలు

author img

By

Published : Aug 1, 2021, 8:10 AM IST

Updated : Aug 1, 2021, 2:09 PM IST

lal-darwaja-simhavahini-bonalu-started-in-hyderabad

హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ప్రధానంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న ఆలయాల్లో ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. భక్తుల కోసం అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లుచేశారు.

హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. గతేడాది కరోనా కారణంగా వేడుకలకు భక్తులు హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో.. బోనాలు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహినీ మహంకాళి మందిరంతో పాటు చందూలాల్ బేలలోని మాతేశ్వరి ఆలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, శాలిబండ, ఉప్పుగూడ, చంద్రాయణగుట్ట, మీరాలం మండి, గౌలిగూడ ప్రాంతాల్లోని ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

వైభవంగా లాల్ దర్వాజ బోనాలు

అగస్టు 2న రంగం...

అర్ధరాత్రి బలిగంప కార్యక్రమంతో బోనాల ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం నుంచే అమ్మవారి వద్దకు భక్తులు బోనాలతో తరలివస్తున్నారు. అంతేకాకుండా పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆగస్టు 2న రంగంతో పాటు అంబారీ ఊరేగింపు కూడా ఉంటుంది. భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మద్యం దుకాణాలు బంద్..

బోనాలు పురస్కరించుకొని హైదరాబాద్‌ మహానగర పరిధిలో మద్యం దుకాణాలు మూసివేశారు. నేటి నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలతో పాటు బార్లు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: Lal Darwaza Bonalu: నేడే లాల్‌దర్వాజా బోనాలు.. ఉత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం

Last Updated :Aug 1, 2021, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.