మల్లారెడ్డి పాదయాత్రను అడ్డుకున్న కాంగ్రెస్​ నేతలు.. జవహర్​నగర్​లో ఉద్రిక్తత

author img

By

Published : Nov 20, 2022, 12:54 PM IST

Minister Mallareddy Padayatra

Clash Between TRS and Congress Leaders in Gabbilalpet: కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్​ శ్రేణుల నుంచి చుక్కెదురైంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తోన్న పాదయాత్ర జవహర్​నగర్​లో కొనసాగుతుండగా.. కొందరు కాంగ్రెస్​ నేతలు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. జవహర్​నగర్​లో ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పాదయాత్ర ముందుకు సాగనివ్వమని హెచ్చరించారు. దీంతో ఆ ప్రాంతంలో టీఆర్​ఎస్​, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మల్లారెడ్డికి చుక్కెదురు.. పాదయాత్రను అడ్డుకున్న కాంగ్రెస్​ నేతలు

Clash Between TRS and Congress Leaders in Gabbilalpet: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర నిర్వహిస్తున్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి చుక్కెదురైంది. సికింద్రాబాద్​లోని గబ్బిలాల్​పేట ప్రాంతంలో పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలో కొందరు కాంగ్రెస్ నాయకులు మంత్రి మల్లారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. జవహర్​నగర్ ప్రాంతంలో సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జవహర్ నగర్​లో జీవో నెంబర్​ 58, 59 అమలు, 50 పడకల ఆసుపత్రి విషయంలో మంత్రి మల్లారెడ్డి హామీలకే పరిమితమయ్యారని వారు దుయ్యబట్టారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్, టీఆర్​ఎస్​ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం కాస్త తోపులాటకు దారి తీసింది. దీంతో గబ్బిలాల్​పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలు వారిని చెదరదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మంత్రి మల్లారెడ్డి జవహర్​నగర్ ప్రాంతంలో నెలకొన్న సమస్యల విషయంలో పరిష్కారం చూపాలని లేని పక్షంలో పెద్ద ఉద్యమం చేపడతామని కాంగ్రెస్​ నేతలు హెచ్చరించారు.

"గత ఎన్నికల్లో జవహర్​ నగర్​లో జీవో నెంబర్​ 58, 59 అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంత వరకు నెరవేర్చలేదు. 50 పడకల ఆసుపత్రి విషయంలో మంత్రి హామీ ఏం అయ్యింది. ప్రజా సమస్యలు కోసం పాదయాత్రకు వచ్చిన మంత్రి అన్ని సమస్యలు తెలుసుకోవాలి. మొత్తం అన్ని డివిజన్​లో పర్యటించి ప్రజా సమస్యలు గుర్తించాలి. పాదయాత్ర మొక్కుబడిగా చేస్తే సహించేది లేదు. మా ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చూపకపోతే మరింత పెద్ద ఉద్యమం చేపడతాం."- సునీత, కాంగ్రెస్​ నాయకురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.